నిరాకరించిన బీజేపీ, టర్న్ తీసుకుని శివసేన కు అవకాశం ఇచ్చిన గవర్నర్

మహారాష్ట్ర రాజకీయాలలో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది.అక్కడ ఎన్నికలు ముగిసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు పై మాత్రం అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.

 Maharashtra Governor Shiva Sena Party To Form A Government-TeluguStop.com

అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అక్కడ జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సంపాదించిన బీజేపీ పార్టీ కి గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ ఆహ్వానం అందించగా దానికి వారు నిరాకరించారు.ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన ఫడ్నవిస్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని తెలిపారు.ఈ నేపథ్యంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేనను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ-105, శివసేన-56, ఎన్సీపీ-54, కాంగ్రెస్-44 స్థానాల్లో గెలుపొందాయి.ప్రభుత్వ ఏర్పాటుకు బలాన్ని, సుముఖతను తెలపాలని శివసేన నేత ఏక్ నాథ్ షిండేకు గవర్నర్ సమాచారమిచ్చినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలో ఈ రోజు రాత్రి 7.30గంటల్లోపు నిర్ణయాన్ని తెలపాలని గవర్నర్ సూచించారు.మరోపక్క మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన ఎన్సీపీతో చర్చించే అవకాశముంది.

Telugu Amithsah, Maharastra, Modi, Shiva Sena-

శివసేనకు మద్దతు ఇచ్చే అంశంపై ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య చర్చలు జరుగుతున్నాయి.అయితే రెండో అతిపెద్ద పార్టీ గా అవతరించిన శివసేన కు ఎన్సీపీ సపోర్ట్ చేయాలి అంటే ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావాలి అంటూ చిన్న కండీషన్ పెట్టినట్లు తెలుస్తుంది.మరి ఆ కండీషన్ కు కట్టుబడి శివసేన నిర్ణయం తీసుకుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube