శివసేన ఆశలు ఆవిరైనట్లేనా!  

Maharashtra Governor Invites Ncp Party To Form A Government - Telugu Bjp And Maharastra Governor, Maharashtra Governor, , Siva Sena And Bjp, Sonia Gandhi Involve In Maharastra Elections

మహారాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.ఎన్నికలు ముగిసి నెల రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు పై మాత్రం ఇంకా ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది.

Maharashtra Governor Invites Ncp Party To Form A Government

సీఎం పీఠం చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలి అంటూ కూటమి పార్టీ శివసేన అభ్యర్ధనను బీజేపీ పార్టీ ససేమిరా అనడం తో అక్కడ ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే ఉత్కంఠత నెలకొంది.ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్ తొలుత అతిపెద్ద పార్టీ గా అవతరించిన బీజేపీ పార్టీకే అవకాశం ఇచ్చినా సంఖ్యా బలం నిరూపించుకోలేమని చేతులు ఎత్తేసింది.

దీనితో రెండో అతిపెద్ద పార్టీ గా ఉద్భవించిన శివసేన పార్టీ ని గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటూ ఆహ్వానించారు.అయితే కాంగ్రెస్,ఎన్సీపీ పార్టీల మద్దతు కూడగట్టుకొని అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించిన శివసేన పార్టీ కి కాంగ్రెస్ పార్టీ గట్టి ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

మొదటి నుంచి మద్దతు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎన్సీపీ పార్టీలు కొన్ని కండీషన్ లు కూడా పెట్టాయి.ఎన్డీయే కూటమి నుంచి శివసేన బయటకు వచ్చేస్తే మహారాష్ట్ర లో ప్రభుత్వ ఏర్పాటు కు తమ మద్దతు ఇస్తామంటూ చెప్పడం తో శివసేన సోమవారం ఆ ఎన్డీయే నుంచి బయటకు కూడా వచ్చేసింది.

అయితే అనుకున్న విధంగా కాంగ్రెస్ మద్దతు ఉంటుంది అని భావించగా కాంగ్రెస్ మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వకపోవడం తో సోమవారం గవర్నర్ భగత్ సింగ్ ను కలిసిన ఆదిత్య థాకరే సంఖ్యాబలం నిరూపించుకోవడానికి మరో రెండు రోజుల గడువు కావాలని కోరడం తో గవర్నర్ ఆదిత్య అభ్యర్ధనను తోసిపుచ్చినట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో ఇప్పుడు మూడో అతిపెద్ద పార్టీ గా నిలిచినా ఎన్సీపీ పార్టీ ని గవర్నర్ ఆహ్వానించారు.అయితే ఎన్సీపీ పార్టీ అటు కాంగ్రెస్,ఇటు శివసేన తో కలిస్తేనే మహారాష్ట్ర లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది.ఎన్నికల కు ముందే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న ఎన్సీపీకి ఇప్పుడు శివసేన ఎంతవరకు మద్దతు ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ ఎన్సీపీ కి శివసేన మద్దతు ఇస్తే ఎలాంటి డిమాండ్స్ చేస్తుంది అన్నది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test