నిందితుడికి పద్మ అవార్డు ఇవ్వాలంటున్న ప్రభుత్వం   Maharashtra Government Weird Recommendation!     2018-03-03   05:30:47  IST  Raghu V

భీమా-కొరెగావ్ అల్లర్ల కేసులో నిందితుడైన సంగిలికి చెందిన రైట్ వింగ్ నేత మనోహర్ అలియాస్ శాంభాజీ భిడేను మహారాష్ట్ర ప్రభుత్వం ‘పద్మ’ అవార్డు కోసం సిఫారసు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పదిమంది సీనియర్ మంత్రులతో కూడిన హైపవర్ కమిటీ భిడేను ‘పద్మశ్రీ’ అవార్డు కోసం సిఫారసు చేస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకు సంబంధించిన పత్రాలు ఇంకా ప్రభుత్వం వద్దకు చేరుకోవాల్సి ఉంది. ఎన్నో కేసులు ఉన్న ఓ నిందితుడిని ‘పద్మశ్రీ’ పౌర పురస్కారానికి సిఫారసు చేయడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం 84 ఏళ్ళ వృద్ధాప్యంలో ఉన్నాడు. మేవార్ సైన్యానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన దళితులపై దాడి చేసిన కేసులో భిడేతోపాటు రైట్ వింగ్‌కు చెందిన మరో నేత మిలింద్ ఎక్బోటేపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 2008లో ‘జోధా-అక్బర్’ సినిమా విడుదలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో థియేటర్లను దోచుకున్న కేసు కూడా అతడిపై నమోదైంది. సంగ్లి జిల్లాలోని మిరాజ్-సంగ్లిలో జరిగిన గణపతి నిమజ్జనోత్సవంలో మత ఘర్షణలు రేకెత్తించారంటూ భిడేపై మరో కేసు కూడా ఉంది. భిడే అలియాస్ భిడే గురూజీ మొదటి నుంచి వివాదాస్పద నేత అవ్వడం, అటువంటి నిందితుడికి పద్మ శ్రీ సిఫారా? అది మహారాష్ట్ర ప్రభుత్వం చేసిందా? ఎంతో ఆలోచించాల్సిన విషయమే ఇది.