సుశాంత్‌ కేసును సీబీఐకి వదలమంటున్న మహా ప్రభుత్వం

దివంగత బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ రాజ్‌ పూత్‌ మృతి విషయంలో రెండు రాష్ట్రాల మద్య రగడ కొనసాగుతున్న విషయం తెల్సిందే.ఇప్పుడు ఈ గొడవ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వంకు సంబంధించిన వివాదంగా ముదురుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

 Sushanth Singh Rajput Case, Death Mystery, Cbi, Maharashtra Government-TeluguStop.com

గత కొన్ని రోజులుగా ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.తాజాగా సుశాంత్‌ రాజ్‌ పూత్‌ కేసును సీబీఐకి అప్పగించాలంటూ బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం కేంద్రంకు సిఫార్సు చేసింది.

దాంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం నుండి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో పాటు అందుకు సంబంధించిన ఉత్వర్వులు కూడా జారీ అయ్యాయి.

ఈ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

ఈ పరిణామంను మహారాష్ట్ర ప్రభుత్వంను అస్థిరత్వ పరిచేందుకు కుట్ర అంటూ విమర్శలు చేశారు.మహా ప్రభుత్వం ఈ కేసు విషయంలో చాలా సీరియస్‌గా ఉందని, ప్రతి ఒక్కరిని విచారించి ఇప్పటికే కేసును ఒక కొలిక్కి తీసుకు వచ్చినట్లుగా చెప్పుకొచ్చారు.

ఇలాంటి సమయంలో రాజకీయ ఉద్దేశ్యంతో ఈ కేసును సీబీఐకి ఇవ్వడం జరిగిందని మహా ముఖ్యమంత్రి ఠాక్రే అంటున్నారు.ఆయన ఈ కేసును సీబీఐకి అప్పగించడంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

Telugu Bollywood, Cbi, Mystery, Maharashtra, Sushanth, Sushanthsingh-

మహా పోలీసులను ఈ కేసు విషయంలో అవమానించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.సుశాంత్‌ కేసును ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఛేదిస్తుందని ఆయన పేర్కొన్నాడు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీబీఐ వారికి ఈ కేసును అప్పగించమంటూ క్లారిటీ ఇచ్చారు.దీంతో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం మద్య వైరం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది.

ముందు ముందు సుశాంత్‌ కేసు విషయంలో వివాదం మరెంతగా ముదురుతుందో అంటూ రాజకీయ విశ్లేషకులు ఎదురు చూస్తున్నారు.మహా ప్రభుత్వం పట్టుదలతో ఉంటే వివాదం ముదరడం మాత్రం ఖాయం అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube