నేడే ఎం ఎల్ సీ ల ప్రమాణ స్వీకారం,సీఎం కూడా

మహారాష్ట్ర సీఎం అయిన ఉద్దవ్ ఠాక్రే సోమవారం శాసనమండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.గతేడాది నవంబర్ 28 న మహారాష్ట్ర సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన ఠాక్రే ఎలాంటి సభలోనూ సభ్యుడు కానీ కారణంగా ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లో శాసనమండలి లో సభ్యత్వం నిరూపించుకోవాల్సి ఉంటుంది.

 Maharashtra Cm Uddhav Thackeray To Take Oath As Mlc,maharashtra Cm Uddhav Thacke-TeluguStop.com

పాలక మహారాష్ట్ర వికాస్ అగాదికి చెందిన తొమ్మిది మంది అభ్యర్థులలో ఠాక్రే ఒకరు, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), కాంగ్రెస్, మరియు ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీలతో కూడిన కూటమి గత వారం మండలికి ఎన్నికైన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఉద్దవ్ ఠాక్రే తో సహా మరో 9 మంది సోమవారం మధ్యాహ్నం సమయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మహారాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న 9 స్థానాలకు మరెవరు పోటీ లేకపోవడంతో 9 మంది ఎన్నిక ఏకగ్రీవమైంది.రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతోపాటు శివసేన పార్టీనేత నీలం గోర్హీ, బిజెపి నేతలు గోపిచంద్‌ పడల్‌ కర్‌, ప్రవీణ్‌ దాట్కే, రంజిత్‌ సిన్హా మొహిత్‌ పాటిల్‌, రమేష్‌ కరద్‌ లు ఎమ్‌ఎల్‌సిలుగా ఎన్నికయ్యారు.

కాగా, నిబంధనల ప్రకారం ఏ సభలోనూ సభ్యుడు కాని ఉద్ధవ్‌ ఠాక్రే ఆరు నెలల లోపు ఎన్నిక కాకపోతే సీఎం పదవి కోల్పోవాల్సి వచ్చేది.ఎమ్‌ఎల్‌సిగా ఎన్నికవడంతో ఆయ‌న ముఖ్యమంత్రి పదవికి గండం తప్పింది.

అంతేకాకుండా ఒక శివ సేన చీఫ్ రాష్ట్ర శాసనసభ సభ్యునిగా అవ్వడం ఇదే మొదటిసారి మరియు అతని కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా గత ఎన్నికల్లో పోటీలో నిలిచిన విషయం విదితమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube