మహానుభావుడు మూవీ రివ్యూ  

Mahanubhavudu Review-

చిత్రం : మహానుభావుడు..

మహానుభావుడు మూవీ రివ్యూ-

బ్యానర్ : యూవీ క్రియేషన్స్.

దర్శకత్వం : మారుతీ.

నిర్మాతలు : ప్రమోద్, వంశీ కృష్ణ రెడ్డి.

సంగీతం : తమన్

విడుదల తేది : సెప్టెంబర్ 29, 2017..

నటీనటులు : శర్వానంద్, మేహ్రీన్ తదితరులు ..

ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి … పండగలకు అగ్రహీరోల సినిమాలతో పోటిపడటం, హిట్స్ కొట్టడం. శర్వానంద్ దీన్ని ఓ అలవాటుగా మార్చుకున్నాడు. ఈసారి మారుతి దర్శకత్వంలో మహానుభావుడు లాంటి కామెడి సినిమాను స్పైడర్, జై లవ కుశ లాంటి పెద్ద సినిమాలకు పోటిగా దింపుతున్నాడు. మరి ఆ అలావాటు ఈసారి పొరపాటుగా మారుతుందా, అలవాటు గానే ఉండిపోతుందా చూద్దాం.

కథలోకి వెళితే :

ఆనంద్ (శర్వానంద్) కి ఓసిడి ఉంటుంది. అతిశుభ్రతకి కూడా అతిగా అనిపించేంత శుభ్రంగా తనని మాత్రమే కాకుండా తన పరిసరాల్ని ఉంచుకుంటాడు ఇతను‌. శుభ్రత లేకపోతే తాను భరించలేడు‌...

ప్రవర్తన విపరీతమైన ధోరణిలోకి వెళ్ళిపోతుంది‌. ఇలాంటి వెరైటి క్యారక్టర్ మేఘన (మెహ్రీన్) లాంటి అందమైన అమ్మాయితో ప్రేమలో పడి, తన ఒబ్సెషన్ కి పూర్తి వ్యతిరేకంగా ఉండే పల్లేటూరి వాతవరణానికి వెళ్ళాల్సివస్తుంది. ఆ ఊర్లో అతను పడే పాట్లు ఏంటో, తన జబ్బు వలన ప్రేమకథలో వచ్చిన తంటాలు ఏంటో తెరమీదే చూడండి‌.

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

శర్వానంద్ తిరిగి ఎంటర్టైన్మెంట్ మోడ్ లోకి వచ్చేసాడు. శతమానంభవతి లో సబ్టిల్ గా, సేటిల్ద్ గా నటించిన శర్వానంద్, రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా లో తన పెర్ఫార్మెన్స్ ని ఇంకా పాలిష్ చేసి బాగా నవ్వించాడు. ఒసిడి క్యారక్టర్ కి టైలర్ మెడ్ గా అనిపించాడు శర్వానంద్...

ఉత్తరాది నుంచి వచ్చే చాలామంది హీరోయిన్ల కంటే మేహ్రీన్ చాలా బెటర్. అందంగా ఉంటుంది, మరీ బ్యాడ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు. బానే చేసింది.

నాజర్ షరామామూలే. వెన్నెల కిషోర్ ఎప్పటిలానే మెరుపులు మెరిపించాడు.

టెక్నికల్ డిపార్ట్మెంట్ :

తమన్ సంగీతం ఆల్రేడి పెద్ద హిట్...

పాటలు తెరపై కూడా అదిరిపోయాయి. కిస్ మీ బేబి పాట యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం కూడా బాగుంది.

మహానుభావుడు థీం ని సినిమాలో బాగా రిజిస్టర్ చేసారు. సినిమాటోగ్రాఫీ ప్రతీ యూవీ క్రియేషన్స్ సినిమాలానే రిచ్ గా ఉంది. ఫ్రేమ్స్ లో బడ్జెట్ స్పష్టంగా కనిపిస్తుంది.

ఎడిటింగ్ షార్ప్ గా సరిపోయింది. కమర్షియల్ పంథా సినిమాకి ఇలా ఉంటె చాలు. విశ్లేషణ :

భలే భలే మొగాడివోయ్ సినిమాతో మారుతి రేంజ్ మారిపోయింది.

ఆ సినిమాకి వచ్చిన హైప్ తోనే, వెళ్లి మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్స్ కి కథలు చెప్పగలిగాడు ఈ ఫిలింనగర్. కాని వెంకటేష్ తో బాబు బంగారం తో స్టార్స్ ని హ్యాండిల్ చేయలేడు ఏమో అనే అనుమానం తానే పుట్టించాడు. ఆ భయం వలనే ఏమో, మళ్ళీ భలే భలే మొగాడివోయ్ ఫార్మట్ వాడేసి, మతిమరుపు ప్లేస్ లో అతిశుభ్రత పెట్టేసి మహానుభావుడు తీసేసాడు.

ఫార్మాట్ పాతదే అయితేనేం, ఫన్నిగా ఉంటె చాలు. మహానుభావుడు భలే భలే మొగాడివోయ్ కి సీక్వెల్ లాంటిది. కాని మిస్ ఫైర్ అవ్వలేదు.

ఆ సినిమాలో ఉన్న వినోదం పాళ్ళు ఇందులోనూ ఉన్నాయి. కుంటుంబం మొత్తం కలిసి పండగ సమయంలో హాయిగా నవ్వుకోగలిగే సినిమా మహానుభావుడు. సూపర్ హిట్ గ్యారంటీ.

ప్లస్ పాయింట్స్ :

* హీరో క్యారక్టర్..

* వినోదం పాళ్ళు..

* సంగీతం..

మైనస్ పాయింట్స్ :..

* కొన్ని డ్రమాటిక్ సన్నివేశాలు..

* ప్రీ క్లయిమాక్స్

రేటింగ్ :3.25/5