షాంఘై ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికైన మహానటి  

షాంఘై ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికై అరుదైన గౌరవం సొంతం చేసుకున్న మహానటి మూవీ .

Mahanati Selected To 22nd Shanghai International Film Festival-director Nag Aswin,keerthi Suresh,mahanati,tollywood

సావిత్రి జీవిత కథగా తెరకెక్కిన మహానటి సినిమా తెలుగు నాట ఎంత సంచలనం విజయం అందుకుందో అందరికి తెలిసిందే. అద్బుతమైన దృశ్య కావ్యంగా నాగ్ అశ్విన్ ఆ సినిమాని ఆవిష్కరించారు. ఇక కీర్తి సురేష్ క్రేజ్ మహానటి సినిమాతో ఒక్కసారిగా ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిపోయింది...

షాంఘై ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికైన మహానటి-Mahanati Selected To 22nd Shanghai International Film Festival

ఇక జాతీయ స్థాయిలో మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ తనదైన గుర్తింపుని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే జాతీయ అవార్డుల రేస్ లో కూడా మహానటి సినిమా సత్తా చాటింది. అదే స్థాయిలో ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో మహానటి సినిమా ప్రదర్శనకి వెళ్ళింది.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి మరో అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌నోర‌మ‌` విభాగంలో ఏకైక భార‌తీయ చిత్రంగా 22వ షాంఘై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ మ‌హాన‌టి`ఎంపికైంది. ఈ వేడుక‌ల్లో భాగంగా మెయిన్ లాండ్ చైనాలో ఈ సినిమా ప్రీమియ‌ర్‌ను ప్ర‌దర్శించ‌నున్నారు. ఇలా షాంఘై ఫిలిం ఫెస్టివల్ కి ఈ మధ్యకాలంలో ఎంపికైన మొదటి తెలుగు సినిమా మహానటి కావడం విశేషం.