మెగాస్టార్ తో మహానటి రొమాన్స్! సెట్ చేసిన కొరటాల  

మెగాస్టార్ తో రొమాన్స్ కి రెడీ అయిన కీర్తి సురేష్. .

Mahanati Keerthi Suresh Romance With Megastar-ram Charan,romance With Megastar,telugu Cinema,tollywood

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి నిర్మాత రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమాని మెగాస్టార్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు..

మెగాస్టార్ తో మహానటి రొమాన్స్! సెట్ చేసిన కొరటాల-Mahanati Keerthi Suresh Romance With Megastar

ఈ సినిమాని ఆగష్టులో ప్రారంభించడానికి దర్శకుడు కొరటాల సిద్ధం అవుతున్నాడు. ఇక ఈ సినిమాని కూడా రామ్ చరణ్ నిర్మించడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నా ఈ సినిమాలో హీరోయిన్స్ ని ఫైనల్ చేసే పనిలో దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.

ఇక చిరంజీవికి జోడీగా ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ తో సంప్రదింపులు జరిపిన కొరటాల ఫైనల్ గా ఇద్దరు హీరోయిన్స్ ని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. మహానటి సినిమాతో టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన కీర్తి సురేష్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ చేస్తూ ఉండగా సెకండ్ హీరోయిన్ గా శ్రుతి హసన్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ ఓ వైపు సూపర్ స్టార్ రజినీకాంత్ కి జోడీగా దర్బార్ మూవీలో నటిస్తూ ఉండగా మరో వైపు మెగాస్టార్ తో కూడా జత కట్టే అవకాశం రావడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.