మ‌హానాడులో హైలెట్స్ ఇవే....

లోకేష్‌ని మినిస్టర్‌ని చేయాల‌ని.మూడోరోజు మ‌హానాడులో నేత‌లు కొంద‌రు చంద్రబాబుని కోరేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.

 Mahanadu High Lights-TeluguStop.com

ఇప్ప‌టికే మ‌హానాడు ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించిన ఓ నేత బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ ఎన్‌టిఆర్ తో స‌హా అంద‌రి ఫోటోల‌ను ప‌క్క‌కు పెట్టేలా చూసార‌ని దేశం వ‌ర్గాల‌లోనే గుస‌గుస వినిపిస్తోంది.

ఆధ్యాత్మిక న‌గ‌రం తిరుప‌తిలో గ‌త రెండు రోజులుగా జ‌రుగుతున్న మహానాడులో ప‌లు ప్ర‌త్యేక‌త‌లు చోటు చేసుకున్నాయి.

వివిధ జిల్లాల నుంచి వ‌చ్చిన కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరిస్తున్నాయి.డాన్స్‌ మాస్టర్‌ సత్య బృందం వారి నృత్యగీతాలు, మంత్రి రావెల కిశోర్‌బాబు సారధ్యంలో రూపొందించిన చంద్రన్న సంక్షేమ పాలన బృంద గీతాలు, తప్పెటగుళ్లు ఆక‌ట్టుకున్నాయి.

తిరుపతికి చెందిన కొంద‌రు ఇంజ‌నీరింగ్ విద్యార్థులు అమెరికన్ టెక్నాలజీతో రూపొందించిన రోబోటెక్ టాకింగ్ ట్రీ అంద‌రినీ ఆక‌ట్టుకొంటోంది.మ‌రోవైపు ఎన్టీఆర్ సినీ జీవిత విశేషాలను తెలియ జేసేలా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫోటో త్రీడీ ఎగ్జిబిషన్ మహానాడుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన‌టంలో సందేహంలేదు.

తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, అండమాన్‌ తదితర రాష్టాల కేడ‌ర్‌తో పాటు, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, కువైట్‌ తదితర దేశాల నుంచి విచ్చేసిన సౌహార్ధ్ర ప్రతినిధి బృందాలు ప్రాంగణంలో గ‌త రెండు రోజులుగా .చేస్తున్న హ‌డావిడి అంతా ఇంతా కాదు.వీట‌న్నింటికీ మించి రాయ‌ల‌సీమ రుచుల‌తో కూడిన వంట‌కాలు అంద‌నీ అవురావురుమ‌నిపిస్తున్నాయి.దీంతో భోజ‌న విరామ స‌మయంలో కొన్ని ఇబ్బందులు త‌లెత్తుతున్నా, నిర్వాహ‌కులు స‌ర్ధి చెపుతూ అంద‌రికీ భోజ‌నాలు అందేలా చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్టాల‌లోసంస్ధాగతంగా గట్టి పునాది ఉన్న టీడీపీ ఇరు నాయ‌కుల‌నీ వారిని కలిపి జ‌రిగేలా రూపొందించిన ఈ సమావేశాలు విశిష్టత సంత‌రించేలా తన ప్రత్యేకతను ఈ సమావేశాల ద్వారా నిలుపుకొంటోంది.త‌న దైన వాగ్ధాటిలో మేటి నేతగా ఎదిగిన పయ్యావుల కేశ‌వ్‌, సీత‌క్క త‌దిత‌రుల వ్యాఖ్యానం నేతలను ఆకట్టుకుంటోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube