తేలిన పంపకం ! ఎవరికి ఎన్ని సీట్లు అంటే ...?   Mahakootami Sets Sharing List Is Final     2018-10-28   09:25:43  IST  Sai M

తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలోని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ. టీజేఎస్ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో నిన్న రాత్రి టీటీడీపీ చీఫ్ ఎల్.రమణ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌లు.. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై విడివిడిగా చర్చించారు.

ఈ భేటీలో సీట్ల పంపకంలో నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ 91, టీజేఎస్ 8, టీడీపీ 15 సీట్లలో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. ఐతే.. ఎవరెవరు ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశంలో స్పష్టం లేనట్టు తెలిసింది.