వేటూరి పై సీరియస్ అయినా మహదేవన్.. చివరికి ?

అడవి రాముడు.సీనియర్ ఎన్టీఆర్ కథ హీరోగా జయప్రద హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 1977 లో విడుదల అయ్యి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.

 Mahadevan Serious On Veturi Sr Ntr Adavi Ramudu Movie Details, Mahadevan, Veturi-TeluguStop.com

వాస్తవానికి ఈ చిత్రం ఈ చిత్రానికి రీమేక్ కాకపోయినా కన్నడ సినిమా అయినా గంధద గుడి అనే ఒక చిత్రాన్ని ఆధారం చేసుకొని కథ అల్లడం జరిగింది.అలాగే షోలే సినిమాలో సైతం కొన్ని సీన్స్ ని ఉపయోగించుకున్నారు.

ఈ సినిమా విడుదల అయ్యాక అది సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.సత్య చిత్ర పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిచగా, కె రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు.

ఇక సంగీత కే వి మహదేవన్ సమకూర్చగా పాటలన్ని కూడా వేటూరి చేత రాయించారు.ఈ సినిమా ఘనవిజయం సాధించడం వెనక మ్యూజిక్ మరియు పాటలు ముఖ్య కారణం.

ఇక ఈ చిత్రంలోని అన్ని పాటలు ఆణిముత్యాలే.ముఖ్యంగా ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి పాట కు యువత మైమరిచి స్టెప్పులు వేశారు.ఇప్పటికి వాన పాట వస్తే అందరికి మనసులో మదిలో పాట ఇదే.ఇందులో వచ్చిన పాటలన్ని కూడా ఒకే తాళంలో రాసారు వేటూరి. త్రిశ్రం ఆధారంగానే అన్ని రాయగా, చివరి క్లైమాక్స్ పాట మాత్రం చతురస్రంలో ఉండాలని మహదేవన్ వేటూరికి సూచించారు.రాఘవేంద్ర రావు సన్నివేశం వివరించి అక్కడ నుంచి వెళ్లిపోగా, సూచనలు చేసి మహదేవన్ కూడా నిష్క్రమించారు.

ఇక వేటూరి తనపని మొదలు పెట్టి పాట పూర్తి చేసి రాఘవేంద్ర రావు కి అప్పగించారు.అయన ఒకే చేసి మహదేవన్ కి ఇచ్చారు.

Telugu Adavi Ramudu, Raghavendra Rao, Mahadevan, Nandamuritaraka, Tollywood, Vet

మహదేవన్ పాట చూసి కోపోద్రుక్తుడు అయ్యాడు.నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి అంటూ ఆగ్రహించాడు.నువ్వు రాసింది కనీసం నువ్వైనా చదివావా అంటూ సీరియస్ అయ్యారు.దాంతో వేటూరి తాను రాసిన పాటను పడటం మొదలు పెట్టారు.చూడరా చూడరా సులేమాన్ మియ్యా అంటూ అందుకున్నారు.నేను చతురస్రంలో రాయమంటే ఇలా రాశావేంటి అని అడిగారు.

దీనిని ఇప్పుడు చతురస్రంలోకి మార్చమని కూడా చెప్పారు.కానీ ఆలా ఎలా మార్చాలో వేటూరికి అర్ధం కాలేదు.

రెండు చూడరా అనే పదాలకు బదులు నాలుగు సార్లు చూడరా అంటే సరిపోతుంది అని చెప్పడం తో అదే విధంగా వేటూరి మర్చి రాసి ఇచ్చారు.అది అలాగే పాడి సినిమాలో పెట్టించారు.

జనాలు ఆ పాటకు సైతం ఉర్రుతలూగిపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube