ఏ ఇంట్లో అయినా ఏ కారణం లేకుండా వస్తువులు అన్ని వాటికీ అవే కాలిపోతాయా ? అసలు ఎక్కడ అలాంటి ఘటన జరగదు కదా! కానీ ఓ ఇంట్లో మాత్రం ఈ ఘటన జరుగుతుంది.అసలు ఏం జరుగుతుంది అంటే ? తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలం కోటగడ్డ అనే గ్రామంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. వేములపల్లి రాజు అనే వ్యక్తి ఇంట్లో అసలు ఏమైందో తెలీదు.అక్కడ గ్యాస్ లీక్ కాలేదు.పెట్రోల్ లేదు.కిరోసిన్ లేదు.
కాదు ఉన్నట్టుండి వస్తువలన్నీ కాలిపోతున్నాయి. షార్ట్ సర్క్యూట్ లేదు, అగ్ని ప్రమాదం లేదు ఏమి లేకుండా వస్తువులన్నీ కాలి బూడిద అవుతున్నాయి.దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులు అంత కూడా గత మూడు రోజుల నుండి ఇంటి బయటే నివాసం ఉంటున్నారు.
3 రోజుల నుండి ఇలాగే జరుగుతుంది.దీంతో కుటుంబ సభ్యులతో పాటు… గ్రామస్థులు కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు.ఇంకా దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఇలా ఎందుకు జరుగుతుంది అని విచారణ చేపట్టారు.
దీంతో ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.