అమెరికా లో మరో విషాదం :నోట్లో తుపాకీ గురిపెట్టి...తెలంగాణ విద్యార్థిపై కాల్పులు!  

  • మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పూసల సాయికృష్ణ అనే యువకునిపై అమెరికాలోని మిచిగాన్‌లో గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న సాయికృష్ణ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

  • షిగన్‌ రాష్ట్రంలోని డెట్రాయిట్‌ నగరంలో జనవరి 3వ తేదీ రాత్రి సాయికృష్ణ మీద దాడి జరిగింది. లారెన్స్‌ టెక్‌ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ పూర్తి చేసిన సాయికృష్ణ డెట్రాయిట్‌లోని ఆటోమోటివ్‌ కంపెనీలో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నారు. మూడో తేదీ రాత్రి 11.30కి సాయికృష్ణ ఒక్కడే కారులో ఇంటికి వెళ్తూ స్థానిక మెక్సికన్‌ ఫుడ్‌కోర్టు దగ్గర ఆగారు.

  • Mahabubabad Techie Shot At America With Gun Mouth-Mahabubabad Pusala Sai Krishna Telugu Viral News

    Mahabubabad Techie Shot At America With Gun At Mouth

  • ఆయన కారు దిగకముందే కొందరు దుండగులు అనూహ్యంగా కారులో జొరబడ్డారు. సాయికృష్ణను తుపాకీతో బెదిరించి కారులో కొన్ని మైళ్ల దూరం తీసుకువెళ్లారు. ఎవరూ లేని నిర్జన ప్రదేశంలో కారు ఆపి నిలువుదోపిడీ చేశారు. బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌, ఐడీ కార్డులు, క్రెడిట్‌కార్డులు, డెబిట్‌ కార్డులు లాక్కున్నారు. ప్యాంటు కూడా విప్పించారు. ఆ తర్వాత సాయికృష్ణ నోట్లో తుపాకి పెట్టి కాల్చారు.

  • Mahabubabad Techie Shot At America With Gun Mouth-Mahabubabad Pusala Sai Krishna Telugu Viral News
  • తీవ్ర రక్తస్రావంతో చల్లని చలిలోనే సాయికృష్ణ పడిఉన్నారు. అటుగా వెళ్తున్న కొందరు బాధితుడిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన సాయికృష్ణకు డెట్రాయిట్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉందని నాలుగైదు ఆపరేషన్లు చేయాల్సిన అవసరం ఉందని తెలిసింది.

  • Mahabubabad Techie Shot At America With Gun Mouth-Mahabubabad Pusala Sai Krishna Telugu Viral News
  • శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉండడంతో అక్కడి వైద్యులు మహబూబాబాద్‌లో ఉంటున్న అతని తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. ‘గొంతు, వెన్నుపూస వద్ద శస్త్ర చికిత్స చేస్తున్నామని, రక్తం అవసరమైతే ఎక్కిస్తామని, వైద్యపరంగా అందించాల్సిన సేవలన్నింటినీ అందిస్తామని వాళ్లు మాతో చెప్పారు. మేము అంగీకరించిన తర్వాతనే శస్త్ర చికిత్స చేశారు’ అని సాయికృష్ణ తల్లిదండ్రులు శైలజ, ఎల్లయ్య