మహావికాస్ అఘాడీలో శివసేన రెబల్స్ చిచ్చు

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పతనం దిశగా పరుగులు తీస్తోంది.శివసేన మంత్రి ఏక్ నాథ్ షిండే రేపిన చిచ్చు చివరికి ప్రభుత్వం రద్దుకు దారి తీయబోతోంది.

 Maha Vikas Aghadi In Minority Due To Shivasena Rebels Details, Maha Vikas Aghadi-TeluguStop.com

తిరుగుబాటు దారులు దారికి రాకపోవడంతో కేబినెట్ సమావేశమై అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయడానికి సిద్ధమవుతోంది.శివసేనలోని 44 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది.

దీంతో అటు ప్రభుత్వాన్ని, ఇటు అసెంబ్లీని రద్దు చేయడానికే కేబినెట్ నిర్ణయించింది.ఇదిలా ఉంటే గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి కోవిడ్ సోకి ఆస్పత్రిలో చేరారు.

ఇటు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కూడా కోవిడ్ తో హోం ఐసోలేషన్ లో ఉన్నారు.అందువల్ల మహారాష్ట్ర కేబినెట్ వర్చువల్ గా సమావేశమైంది.

గవర్నర్ కోవిడ్ బారిన పడటంతో కేంద్ర ప్రభుత్వం గోవా గవర్నర్ కు మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించింది.మైనారిటీలో పడిన ప్రభుత్వం అసెంబ్లీ రద్దుకు సిఫార్పు చేసినంత మాత్రాన గవర్నర్ ఆ తీర్మానాన్ని ఆమోదించాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు కేబినెట్ నిర్ణయం ప్రకారం అసెంబ్లీ రద్దు అవుతుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.ఉద్ధవ్ మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదిస్తారా లేక ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారా అనేది చూడాలి.

తిరుగుబాటు ఎమ్మెల్యేలను కలుపుకుంటే ప్రతిపక్ష బీజేపీకి మెజారిటీ వస్తుంది.అసలు శివసేన తిరుగుబాటు నేత షిండే కోరిక కూడా బీజేపీతో కలవాలన్నదే.

అందువల్ల ప్రతిపక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడటానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Telugu Ek Nath Shindey, Maharashtra, Shivasena, Shivsena-Political

మహావికాస్ అఘాడీలో శివసేన రెబల్స్ చిచ్చు రేపింది.ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో కూటమికి బీటలు.56 నుంచి 12కి పతనమైంది శివసేన బలం.అయితే పార్టీలో సీఎం ఉద్ధవ్ థాక్రే ఏకాకిగా మారారు.పతనం తప్పకపోతే అసెంబ్లీ రద్దవుతుందని రౌత్ ట్వీట్ చేశారు.

ఎమ్మెల్యేలందరినీ ముంబై రమ్మని బీజేపీ ఆదేశించారు.కేబినెట్ అసెంబ్లీ రద్దు తీర్మానం చేసినా గవర్నర్ ఆమోదిస్తరా?.మైనారిటీ ప్రభుత్వం నిర్ణయాన్ని గవర్నర్ గౌరవిస్తారా?.అసెంబ్లీలో బల నిరూపణకు ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారా?.చూడాలి మరి…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube