మహా శివరాత్రి రోజు విభూతిని తయారుచేస్తారట... ఎందుకో తెలుసా?

మహాశివుడికి శివరాత్రి అంటే ఎంతో ముఖ్యమైన పండుగ.శివరాత్రి రోజు స్వామివారు విశేష పూజలను అందుకుంటారు.

 Maha Shivratri 2021 Significance Of Vibhuthi-TeluguStop.com

మహాశివుడు సాకారమైన మూర్తిగా, నిరాకారమైన లింగంగాను పూజలు అందుకుంటాడు.ఆ పరమేశ్వరుడు లింగాకృతి పొందినది ఈ మహా శివరాత్రి రోజు కనుక శివరాత్రి రోజు స్వామివారికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన శివరాత్రి రోజు స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి.పెళ్ళికాని యువతీ యువకులకు పెళ్లి ఘడియలు దగ్గరకు వస్తాయి.

 Maha Shivratri 2021 Significance Of Vibhuthi-మహా శివరాత్రి రోజు విభూతిని తయారుచేస్తారట… ఎందుకో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలిసి తెలియక చేసిన పాపాలు అన్ని తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

మహాశివరాత్రి రోజు ప్రాతః కాల సమయంలో నిద్ర లేచి తలంటు స్నానం చేసి పువ్వులు, ఫలాలు, ఆ పరమేశ్వరునికి అభిషేకాలు నిర్వహించి పూజ చేస్తారు.

పూజ సమయంలో శివ పంచాక్షరి, లింగాష్టకం వంటివి జపిస్తారు.అదేవిధంగా శివరాత్రి రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉంటూ తెల్లవార్లు జాగరణలు చేసి భక్తి గీతాలు ఆలపిస్తారు.

శివరాత్రి పండుగ రోజు ఉపవాసం జాగరణ ఎంతో ముఖ్యమైనవి.

Telugu Lard Shiva, Maha Sivaratri, Pooja, Vibhuthi-Telugu Bhakthi

పరమేశ్వరుడికి పువ్వులు పండ్లుతో పాటు విభూది అంటే ఎంతో ప్రీతికరం.పురాణాల ప్రకారం పరమేశ్వరుడు సాగర మధనం చేసిన సమయంలో విషం తాగినప్పుడు ఆ మంటను తగ్గించడానికి స్వామివారి గొంతుపై విభూదిని రాయటం వల్ల స్వామివారికి చల్లదనం ఏర్పడిందని చెప్తారు.అందుకే స్వామివారికి విభూది అంటే ఎంతో ఇష్టం.

శివరాత్రి రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన విభూదిని తయారుచేస్తారు.అందుకే శివ భక్తులు ఎంతో పరమ పవిత్రమైన విభూతిని శరీరమంతా దరిస్తారు.

ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన శివరాత్రి రోజు ఎలాంటి పరిస్థితులలో తప్పు చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు.

#Lard Shiva #Pooja #Vibhuthi #Maha Sivaratri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU