మెగా స్టార్ చిరంజీవి, కొరటాల శివ ల కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.ప్రస్తుతం గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్న ఈ సినిమా ను వచ్చే నెల 5 తో ఆ షెడ్యూల్ ను ముగించబోతున్నారు.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను ప్రముఖ స్టార్స్ కూడా ఎదురు చూసే విధంగా దర్శకుడు కొరటాల శివ మేకింగ్ చేస్తున్నాడు.మొదటి ఈ సినిమా లో చిరంజీవి మరియు రామ్ చరణ్ లు పూర్తి స్థాయిలో నటించబోతున్నారు.
కనుక సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే చిరంజీవి ఫస్ట్ లుక్ వచ్చేసింది.ఇక రావాల్సింది చరణ్ ఫస్ట్ లుక్.
ఈ ఫస్ట్ లుక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ను ఇండస్ట్రీ వర్గాల వారు వినిపిస్తున్నారు.
ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో మహా శివరాత్రి సందర్బంగా చరణ్ ఆచార్య లుక్ ను విడుదల చేయబోతున్నారట.
మోషన్ పోస్టర్ ను విడుదల చేయడంతో పాటు చరణ్ మరియు చిరుల కు సంబంధించిన ఒక స్టిల్ ను కూడా అధికారికంగా విడుదల చేస్తారని అంటున్నారు.పోస్టర్ లో చిరు చరణ్ కలిసి ఉంటారా లేదా చరణ్ ఒక్కడే ఉంటాడా అనే విషయమై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమ ఆషూటింగ్ అప్ డేట్ విషయానికి వస్తే మరో వారం రోజుల్లో మేరేడుమిల్లి ప్రాంతం లో జరుగుతున్న షూటింగ్ పూర్తి అవ్వబోతుంది.వచ్చే నెల మూడవ వారంలో హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ ప్రారంభించి చక చక పూర్తి చేయబోతున్నారు.
సినిమా విడుదల తేదీ ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది కనుక మరీ ఆలస్యం చేయకుండా హడావుడిగా సినిమా షూటింగ్ ను ముగించేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
