తెలుగు నెలల్లో పదకొండవ నెల మాఘ మాసంలో వచ్చే మహాశివరాత్రి పండుగను హిందువులు పెద్ద ఎత్తున ఎంతో ఘనంగా జరుపుకుంటారు.పురాణాల ప్రకారం పరమేశ్వరుడు, పార్వతీ దేవిను కళ్యాణం చేసుకున్న రోజు శివరాత్రి కావడంతో ఈ రోజున శివాలయాల్లో పెద్దఎత్తున పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిపిస్తారు.
కేవలం వీరి కళ్యాణం మాత్రమే కాకుండా ఆ పరమశివుడు మహాశివరాత్రి రోజున లింగ రూపం ధరించాడని శివపురాణం తెలియజేస్తుంది.ఎంతో పవిత్రమైన ఈ రోజును ప్రతి సంవత్సరం మాఘ మాసంలో చతుర్దశి తిథి (14 వ రోజు) ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
మరి సంవత్సరం శివరాత్రి పండుగ ఎప్పుడు వచ్చింది? ఏ సమయంలో పూజ చేయాలి? జాగరణ ఏ విధంగా చేయాలి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
ప్రతి ఏడాది మహాశివరాత్రి మార్చి లేదా ఫిబ్రవరి నెలలో వస్తుంది.అయితే 2021 సంవత్సరం మహాశివరాత్రి మార్చి 11 గురువారం వచ్చింది.11వ తేదీ స్వామివారిని పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలతో పూజించుకొని 11వ తేదీ రాత్రి జాగరణ చేస్తారు.ఈ విధంగా జాగరణ చేయడానికి కారణం ఏమిటంటే ఆ పరమేశ్వరుడు పార్వతీ దేవిని కలుస్తాడు.అంటే శివ శక్తులు కలుస్తారని అర్థం.శివుడు అంటే పురుషుడు, శక్తి అంటే ప్రకృతి ఈ కలయిక వల్ల సృష్టి ఆవిర్భవిస్తుందని భావిస్తారు.అందుకోసమే మహా శివరాత్రి రోజు భక్తులు జాగరణ చేస్తారు.

ఈ ఏడాది చతుర్దశి తిథి గురువారం మధ్యాహ్నం2.39 మొదలయ్యి మార్చి 12 శుక్రవారం మధ్యాహ్నం3.02 కి ముగుస్తుంది.సాధారణంగా మహా శివరాత్రి పూజలు అర్ధరాత్రి సమయంలో చేస్తారు.అయితే ఈ ఏడాది పూజకు సరైన సమయం 12వ తేదీ ఉదయం12.06 కి మంచి ముహూర్తం ప్రారంభం అయ్యి12.55కి ముగుస్తుంది కేవలం ఒక గంట వ్యవధి కాలం మాత్రమే స్వామివారి పూజకు ఎంతో అనువైన సమయం అని చెప్పవచ్చు.ఈ సమయంలోనే కచ్చితంగా పూజ చేయాలనే నియమాలు ఏమీ లేవు.
స్వామి వారికి భక్తితో ఏ సమయంలోనైనా పూజ చేయవచ్చు.ముఖ్యంగా మహా శివరాత్రి రోజు ప్రాతః కాల సమయంలో నిద్రలేచి ఆ పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాస దీక్షలతో, జాగరణలతో స్వామివారి మంత్రాలను చదువుతూ పూజించడం వల్ల ఆ పరమేశ్వరుని అనుగ్రహం మనపై ఉంటుంది.
DEVOTIONAL