మహా సముద్రం vs బ్యాచిలర్.. బాక్సాఫీస్ టఫ్ ఫైట్..!

ఈ దసరాకి రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి.అందులో ఒకటి మహా సముద్రం కాగా.

 Maha Samudram Vs Bachelor Movie Dasara Boxoffice Fight-TeluguStop.com

మరొకటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.ఆరెక్స్ 100 అజయ్ భూపతి డైరక్షన్ లో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా మహా సముద్రం.

ఇదివరకు ఎప్పుడూ చూడని ఓ ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా రాబోతుందని అంటున్నారు.ఆరెక్స్ 100తో సత్తా చాటిన అజయ్ భూపతి ఈ సినిమాతో కూడా తాను హిట్టు కొట్టడం పక్కా అని అంటున్నారు.

 Maha Samudram Vs Bachelor Movie Dasara Boxoffice Fight-మహా సముద్రం Vs బ్యాచిలర్.. బాక్సాఫీస్ టఫ్ ఫైట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక దసరా రేసులో అఖిల్ బ్యాచిలర్ సినిమా కూడా వస్తుంది.మహా సముద్రం క్లాస్ మాస్ మిక్స్ అయ్యి వస్తుంటే.అఖిల్ బ్యాచిలర్ సినిమా మాత్రం రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా వస్తుంది.ఈ సినిమాలు రెండు డిఫరెంట్ జోనర్లు కాబట్టి రెండు సినిమాలు విజయాన్ని సాధించే అవకాశం ఉంది.

అయితే అఖిల్ కు ఇంతవరకు కమర్షియల్ హిట్ లేదు.అందుకే బ్యాచిలర్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

ఇక శర్వానంద్ కూడా ఈమధ్య వరుస అపజయాలతో వెనక పడ్డాడు.మహా సముద్రంతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ఒక్కరోజు గ్యాప్ తో వస్తున్న ఈ రెండు సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. అయితే ఈ రెండిటితో పాటుగా కె.రాఘవేంద్ర రావు సూపర్ హిట్ మూవీ పెళ్లిసందడి సినిమా కూడా రేసులో ఉంది.శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది.

#Siddharth #Sharwanand #Akhil #Maha Samudram #Bachelor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు