మహా సముద్రం నుంచి తప్పుకున్న సమంత  

Samantha Quit From Maha Samudram Movie - Telugu Ajay Bhupathi, Samantha Quit. Maha Samudram Movie, Shrwanand, Tollywood

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి.ఆ సినిమాతో క్రేజీ దర్శకుడుగా మారిన అజయ్ కి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి.

Samantha Quit From Maha Samudram Movie - Telugu Ajay Bhupathi, Samantha Quit. Maha Samudram Movie, Shrwanand, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

బడా నిర్మాతల నుంచి కూడా ఫోన్స్ వచ్చాయి.అయితే అతను ఒకే ఒక కథ పట్టుకొని అందరి నిర్మాతలు హీరోల చుట్టూ తిరిగాడు.

అయితే కొంత మంది హీరోలు డేట్స్ లేక, కొంత మంది హీరోలు కథ మీద ఆసక్తి లేక అతనితో చేయడానికి ముందుకి రాలేదు.అయితే ఫైనల్ గా తన మహా సముద్రం స్క్రిప్ట్ యంగ్ హీరో శర్వానంద్ కి చెప్పి ఒప్పించాడు.

రెండేళ్ళ గ్యాప్ తర్వాత రెండో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యాడు.

ఈ సినిమాలో శర్వానంద్ కి జోడీగా సమంతని అనుకున్నాడు.

ఇక సమంత కూడా మహాసముద్రం సినిమా చేయడానికి ముందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇక త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అనే టైంలో ఊహించని విధంగా ఈ భామ సినిమా నుంచి తప్పుకుంది.

తాజాగా శర్వానంద్, సమంత కాంబినేషన్ లో 96 రీమేక్ గా వచ్చిన జాను సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఫెయిల్ అవడంతో పాటు హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ అంత వర్క్ అవుట్ అవలేదనే టాక్ వినిపించింది.

ఈ నేపధ్యంలో మళ్ళీ వెంటనే శర్వానంద్ తో అంటే ఇబ్బంది అవుతుందని సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది.ఇక సామ్ తప్పుకోవడంతో హీరోయిన్ గా ఇప్పుడు బాలీవుడ్ భామ అధితీరావ్ హైదరీ సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు