మహాసముద్రం రివ్యూ: సిద్దార్థ్ పర్ఫెక్ట్ రీ-ఎంట్రీ.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్

అజయ్ భూపతి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన సినిమా మహాసముద్రం.ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్ గా నటించారు.

 Maha Samudram Review Siddharth Perfect Re Entry Background Music Was Super Maha-TeluguStop.com

యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించాడు.ఈ సినిమాకు సంగీతాన్ని భరద్వాజ్ అందించాడు.

జగపతిబాబు, రావు రమేష్ కూడా ప్రధాన పాత్రలో నటించారు.ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ:

ఈ సినిమా కథ మొత్తం లవ్ స్టోరీ పై సాగింది.ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ తమ తమ జీవితంలో ప్రయాణించగా వీరిద్దరి జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది.

ఆ అమ్మాయి రాకతో వీరి మధ్య కొన్ని మలుపులు తిరుగుతాయి.దీంతో శర్వానంద్, సిద్ధార్థ్ మధ్య అమ్మాయి విషయంలో రావు రమేష్ తో గొడవలు ప్రారంభమవుతాయి.ఇక చివరికి వీరిద్దరూ తమ ప్రేమను గెలుచుకున్నారా.నెగ్గించుకున్నారా.అసలు వీరిద్దరి మధ్య కాంప్రమైజ్ ఎలా ఉందో మిగిలిన కథలోని చూడవచ్చు.

నటినటుల నటన:

శర్వానంద్, సిద్ధార్థ్ మధ్య సంభాషణ బాగా హైలెట్ గా మారింది.అను ఇమ్మానుయేల్, అదితి రావు హైదరి కూడా తమ పాత్రలతో బాగా ఆకట్టుకున్నారు.రావు రమేష్, జగపతి బాబు మాత్రం తమ పాత్రకు ప్రాణం పోసినట్లుగా అనిపించారు.

Telugu Aditi Hyaderi, Maha Samudram, Music, Rao Ramesh, Review, Siddhaarth, Sidh

టెక్నికల్:

డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాకి అద్భుతమైన ప్రేమ కథను అందించాడు.ఇక సంగీతం బాగా మెప్పించింది.బ్యాక్ గ్రౌండ్ కూడా అద్భుతంగా తెరకెక్కించారు.సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది.ఇదివరకువచ్చిన లవ్ స్టోరీ కాకుండా కాస్త కొత్తదనంతో అజయ్ భూపతి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.

విశ్లేషణ:

ఈ సినిమాకు దర్శకుడు అజయ్ భూపతి మంచి కథను ఎంచుకున్నాడు.కథకు తగ్గట్టు నటీ నటులను కూడా ఎంచుకున్నాడు.ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ మధ్య సంభాషణ అద్భుతంగా అనిపించింది.రావు రమేష్ ఎంట్రీతో కథ కాస్త సాగినట్లు అనిపించింది.ఇక్కడి నుండి కథ మరింత హైలెట్ గా మారింది.

ఇంటర్వెల్ మాత్రం బాగా ఆకట్టుకుంది.ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ లో ఎమోషన్ బాగా ఎక్కువగా ఉన్నాయి.

ఈ సినిమాలో ఎక్కువగా ఇంటర్వెల్ భాగం మాత్రం కథకు హైలెట్ గా మారింది.

Telugu Aditi Hyaderi, Maha Samudram, Music, Rao Ramesh, Review, Siddhaarth, Sidh

ప్లస్ పాయింట్స్:

ఫస్టాఫ్, ఇంటర్వెల్ బాగా ఆకట్టుకుంది.బ్యాక్ గ్రౌండ్ అద్భుతంగా మెప్పించింది.సిద్ధార్థ్, శర్వానంద్ తమ పాత్రలతో బాగా ఆకట్టుకున్నారు.

హీరోయిన్స్ కూడా అద్భుతంగా నటించారు.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది.

Telugu Aditi Hyaderi, Maha Samudram, Music, Rao Ramesh, Review, Siddhaarth, Sidh

మైనస్ పాయింట్స్:

మొదట్లో కథ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించింది.సెకండాఫ్ లో ఎమోషన్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి.కామెడీ తగ్గినట్లు అనిపించింది.

బాటమ్ లైన్:

ఈ సినిమాలో కథ చాలా ఆసక్తిగా అనిపించింది.ప్రేక్షకులను మెప్పించే విధంగా దర్శకుడు ఈ కథను తెరకెక్కించాడు.కథ కొత్తదనంతో బాగా ఆసక్తి గా ఉండటం వల్ల ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అర్థమవుతుంది.

రేటింగ్:

3/5

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube