మహా సముద్రం రిజల్ట్.. అజయ్ భూపతికి ధనుష్ ఛాన్స్ ఇస్తాడా..?

ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ అజయ్ భూపతి తన నెక్స్ట్ సినిమా మహా సముద్రం చేశాడు. శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించిన ఈ సినిమా దసరా కానుకగా వచ్చింది.

 Maha Samudram Result.. Is Dhanush Will Gave Chance To Ajay Bhupathi Or Not,lates-TeluguStop.com

సినిమా కథ బాగున్న కథనం స్లో అవడంతో కమర్షియల్ గా అనుకున్న రేంజ్ లో వర్క్ అవుట్ కాలేదు.మహా సముద్రం సినిమా రిజల్ట్ అజయ్ భూపతి కెరియర్ మీద పడుతుందని చెప్పొచ్చు.

ఆరెక్స్ 100 మేకింగ్ తో కోలీవుడ్ హీరో ధనుష్ అజయ్ పనితనం మెచ్చి అతనితో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.మహా సముద్రం హిట్ అయితే ధనుష్ హీరోగా అజయ్ భూపతి డైరక్షన్ లో సినిమా దాదాపు కన్ఫర్మ్ అనుకున్నారు.

కాని మహా సముద్రం అనుకున్న రేంజ్ లో టాక్ రాలేదు.

Telugu Ajay Bhupathi, Dhanush, Kollywood, Latest, Maha Samudram, Sharwanand, Sid

రిలీజ్ ముందు డైరక్టర్ ఫుల్ కాన్ఫిడెంట్ తో సినిమా పక్కా హిట్ అని చెప్పినా సినిమాలో అంత సీన్ లేకపోయేసరికి ఆడియెన్స్ షాక్ అయ్యారు.మరి మహా సముద్రం రిజల్ట్ చూసి ధనుష్ అజయ్ భూపతికి ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.కోలీవుడ్ హీరో ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల డైరక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.దానితో పాటుగా సితార ఎంటర్టైన్మెంట్స్ లో మరో సినిమా కమిట్ అయినట్టు తెలుస్తుంది.

ఈ రెండు సినిమాల తర్వాత అజయ్ భూపతి సినిమా అప్డేట్ వస్తుందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube