దసరా బరిలో పోటీగా నిలిచిన సినిమాల్లో శర్వానంద్, సిద్ధార్థ్ ల మహా సముద్రం ఒకటి కాగా.అఖిల్ బ్యాచిలర్ సినిమా మరొకటి.
వీటితో పాటుగా శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తున్న పెళ్లిసందడి సినిమా కూడా వస్తుంది.ఇక గురువారం రిలీజైన మహా సముద్రం రిజల్ట్ ఏంటో తెలిసింది.
కథ ఓ మోస్తారుగా ఉన్నా అజయ్ భూపతి కథనం సినిమాకు మైనస్ అయ్యిందని అంటున్నారు.
అయితే దసరా పోటీలో నిలిచిన క్రేజీ మూవీస్ లో శర్వానంద్, సిద్ధార్థ్ ల మహా సముద్రం సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.
ఇది కచ్చితంగా అఖిల్ సినిమాకు ప్లస్ అయ్యే అంశమే అని చెప్పొచు.బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో యూత్ ఆడియెన్స్ మెచ్చే అంశాలు ఉన్నాయని అంటున్న్నారు.
అంతేకాదు పూజా హెగ్దే అందాలు కూడా సినిమాకు ప్లస్ అవుతాయని టాక్.ఇన్నాళ్లుగా హిట్ కోసం వేచి చూస్తున్న అఖిల్ కు ఇదో మంచి అవకాశమని చెప్పొచ్చు.
అఖిల్ బ్యాచిలర్ తో అనుకున్న సక్సెస్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. మహా సముద్రం సూపర్ హిట్ టాక్ వస్తే చెప్పలేం కాని ఆ సినిమాకు యావరేజ్ టాక్ రావడం మాత్రం అఖిల్ కు కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు.