మహా సముద్రం డైరక్టర్ సారీ చెప్పేశాడు..!

ఆరెక్స్ 100 తో డైరక్టర్ గా మొదటి సినిమానే సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి తన సెకండ్ సినిమా మహా సముద్రం అని తీశాడు.శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ సినిమా రిలీజ్ ముందు అంచనాలు బాగున్నా ఆఫ్టర్ రిలీజ్ అంచనాలను అందుకోలేదు.

 Maha Samudram Director Ajay Bhupathi Says Sorry To Audience , Ajau Bhupathi, Dir-TeluguStop.com

సినిమా పక్కా హిట్ కొడుతున్నాం అంటూ చిత్రయూనిట్ ముఖ్యంగా డైరక్టర్ చెప్పిన మాటలన్ని నిజం కాకుండాపోయాయి.ఇక డైరక్టర్ గా అజయ్ భూపతికి ఒక్క సినిమాతోనే ఫ్యాన్స్ ఏర్పడ్డారు.

వారు కూడా అతనితో మహా సముద్రం ఫెయిల్యూర్ పై కామెంట్స్ చేస్తున్నారు.

లేటెస్ట్ గా ఒక ఫ్యాన్ మహా సముద్రం అంచనాలను అందుకోలేదని పెట్టిన మెసేజ్ కు రిప్లై గా సారీ మీ అంచనాలను అందుకోలెదు.

నెక్స్ట్ టైం మీ అందరిని సంతృప్తి పరిచే కథతో వస్తానని అన్నాడు.డైరక్టర్ గా తన ఫెయిల్యూర్ ను తను ఒప్పుకోవడానికి కూడా గట్స్ ఉండాలి ఆ గట్స్ తనకు ఉన్నాయని మొదటి సినిమా ఆరెక్స్ 100 తోనే ప్రూవ్ చేసుకున్నాడు అజయ్ భూపతి.

మహా సముద్రం సినిమా ఇమ్మెజరబుల్ లవ్ స్టోరీ అంటూ ఒక మిక్సెడ్ స్టోరీతో వచ్చాడు అజయ్ భూపతి.

సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ ల నటన బాగున్నా సరే కంటెంట్ లో విషయం లేకపోవడంతో సినిమా రిజల్ట్ తేడా కొట్టింది.

అంతేకాదు సినిమా రిలీజ్ కు ముందు డైరక్టర్ విపరీతమైన అంచనాలు పెంచడం కూడా సినిమా రిజల్ట్ కు కారణమని చెప్పొచ్చు.ఏది ఏమైనా డైరక్టర్ గా తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు థర్డ్ మూవీ సక్సెస్ కొట్టి తీరుతా అని చెబుతున్నాడు అజయ్ భూపతి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube