ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి అజయ్ భూపతి.మొదటి సినిమానే ఓ కల్ట్.
బార్కింగ్ సబ్జెక్టు తీసుకొని దానిని తెరపై అంతే బోల్డ్ గా ఆవిష్కరించి అందరి ప్రశంసలు అజయ్ అందుకున్నాడు.అలాగే ఈ సినిమాతో హీరో కార్తికేయ స్టార్ గా మారిపోయాడు.
అలాగే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.వీరిద్దరూ వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.
ప్రేమ పేరుతో అబ్బాయిలని అమ్మాయిలు ఎలా వాడుకొని వదిలేస్తారు అనే ఎలిమెంట్ తో ఈ సినిమాలో అజయ్ భూపతి ఆవిష్కరించాడు.సొసైటీలో ప్రస్తుతం బర్నింగ్ ఇష్యూగా ఉన్న పాయింట్ కావడంతో అందరూ దానికి కనెక్ట్ అయ్యారు.
ఈ కారణంగా సినిమా సూపర్ హిట్ అయ్యింది.సినిమా కంటెంట్ పై కొన్ని విమర్శలు వచ్చిన ఓవరాల్ గా చాలా మందిని మెప్పించింది.

అయితే రెండో సినిమాకి మహా సముద్రం అనే టైటిల్ ఫిక్స్ చేసి గత మూడేళ్లుగా ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి అజయ్ భూపతి ట్రై చేస్తున్నాడు.ఈ కథని కూడా ఓ బార్కింగ్ ఇష్యూ చుట్టూనే అజయ్ రాసుకున్నట్లు తెలుస్తుంది.మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ఎనిమిదేళ్ల తర్వాత సిద్ధార్ధ్ టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. శర్వానంద్ మరో హీరోగా నటిస్తున్నాడు.అదితీరావ్ హైదరీ, అనూ ఇమాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా థీమ్ పోస్టర్ తో చిత్ర యూనిట్ టైటిల్ ని రివీల్ చేసింది.
ఈ పోస్టర్ లో గన్ ని ఓ వ్యక్తి తలకి గురిపెట్టినట్లు ఉంది.అలాగే ఓ వ్యక్తి పరుగెత్తుతూ ఉండగా గన్ మీద ఒక అమ్మాయి, అబ్బాయి నిలబడినట్లు డిజైన్ చేశారు.
ఈ కాన్సెప్ట్ టైటిల్ పోస్టర్ బట్టి ఇది కూడా ప్రస్తుతం సొసైటీలో బర్నింగ్ ఇష్యూగా ఉన్న ఇల్లీగల్ ఎఫైర్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారా అనే డౌట్ వస్తుంది.అదే జరిగితే ఆ కథాంశంని అజయ్ తెరపై ఎలా ఆవిష్కరిస్తారు అనేది చూడాలి.