మహా సముద్రం.. 'మహా' లుక్ అదిరింది..!

శర్వానంద్, సిద్ధార్థ్ కాంబోలో వస్తున్న మల్టీస్టారర్ మూవీ మహా సముద్రం.ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి డైరక్షన్ లో వస్తున్న సెకండ్ సినిమా ఇది.ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.సినిమా నుండి అదితి రావు హైదరి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

 Maha Samudram Aditi Rao Hyderi First Look Release-TeluguStop.com

మహా సముద్రంలో మీట్ మహా.ఆన్ హర్ ఇమ్మెజరబుల్ లవ్ అంటూ అదితి రావు హైదరి ఫస్ట్ లుక్ రిలీజైంది.

సినిమా టైటిల్ లో మహా పాత్రతో అదితి రావు హైదరి సినిమాలో ప్రాముఖ్యత ఉన్న పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది.సినిమాలో మరో హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ కూడా నటిస్తుంది.

 Maha Samudram Aditi Rao Hyderi First Look Release-మహా సముద్రం.. మహా’ లుక్ అదిరింది..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చాలారోజుల తర్వాత సిద్ధార్థ్ ఈ సినిమాతో తెలుగు తెర మీద తన లక్ టెస్ట్ చేసుకోవాలని చూస్తున్నాడు.ఆరెక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతి తన రెండవ సినిమాతో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

చాలామంది హీరోలు రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా హిట్టు కొట్టి వారందరికి తన స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యాడు అజయ్ భూపతి. జాను, శ్రీకాం రెండు సినిమాలు నిరాశపరచడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు శర్వానంద్.

శర్వానంద్, సిద్ధార్థ్ లకు ఇది క్రేజీ మల్టీస్టారర్ అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్.

#First Look #Release #Siddharth #Sharwanand #Maha Samudram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు