మహిళలకి ట్రిబ్యూట్ గా మగువా... మగువా! వకీల్ సాబ్ ఫస్ట్ సాంగ్

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు మహిళల గొప్పతనం స్మరించుకుంటున్నారు.మహిళలు లేకపోతే ఈ ప్రపంచం లేదనే విషయాన్ని మరిచిపోయి ఈ మధ్యకాలంలో మృగాలుగా మారిన మగాళ్ళు అబలలపై దారుణ అత్యాచారాలకి పాల్పడుతున్నారు.

 Maguva O Maguva Pawans Tribute To All The Women-TeluguStop.com

అయితే ఇలాంటి వేళలో మహిళలకి అండగా ఉండేది చాలా తక్కువ మంది.ఇక్కడ కూడా కులం, మతం అని విడిపోయి మహిళల శీలం విలువని లెక్క కడుతున్నారు.

ఇలాంటి టైం లో పవన్ కళ్యాణ్ ఆడవాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలపై పోరాటం చేసే వకీల్ సాబ్ పాత్రలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ఆడవాళ్ళ గొప్పతనం చెబుతూ వచ్చే మగువా మగువా అనే సాంగ్ ని మహిళలకి ట్రిబ్యూట్ గా చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది.స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ సాంగ్ ని ఆలపించగా రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించారు.

ఇక తమన్ ఈ పాటకి స్వరాలు సమకూర్చారు.ఈ మధ్య కాలంలో మహిళల గొప్పతనం చెప్పే విధంగా సరైన సాంగ్ ఒక్కటి కూడా రాలేదు.

అలాంటిది మొదటి సారి వకీల్ సాబ్ సినిమా కోసం దిల్ రాజు ఈ సాంగ్ ని తీసుకొచ్చారు.మెలోడీగా సాగే ఈ సాంగ్ ప్రస్తుతం యుట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

పవన్ తన స్టార్ ఇమేజ్ ని పక్కన పెట్టి ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తుంది.మరి పవన్ కళ్యాణ్ రెండేళ్ళ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

వాటిని దిల్ రాజు టీం ఎంత వరకు అందుకుంటుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube