పొడవైన జుట్టు కావాలనే కోరిక దాదాపు ఆడవాళ్లందరికీ ఉంటుంది.కానీ, నేటి కాలంలో అందరికీ ఆ కోరిక కోరికగానే ఉండి పోతోంది.
ఆహారపు అలవాటు, జీవన శైలిలో వచ్చే మార్పులు, పోషకాల కొరత, హార్మోన్ ఛేంజెస్, హెయిర్ కేర్ లేక పోవడం, కాలుష్యం.ఇలా రకరకాల కారణాల వల్ల చాలా మందిలో జుట్టు ఎదుగుల ఆగిపోతోంది.
దాంతో ఏం చేయాలో అర్థంగాక.ఈ సమస్యను ఎలా నివారించుకోవాలో తెలియక తెగ సతమతమైపోతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని ట్రై చేస్తే గనుక పొడవైన జుట్టును సులభంగా పొందొచ్చు.
మరి ఆలస్యం ఎందుకు ఆ రెమెడీ ఏంటీ.? ఎలా తయారు చేసుకోవాలి.? ఏ విధంగా వాడాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో నాలుగు స్పూన్లు పెసలు వేసి ఒక రాత్రంతా నాన బెట్టుకోవాలి.
ఉదయాన్నే నీటిని తొలగించి క్లాత్‌లో పెసలను మూట్టకట్టుకోవాలి.ఒక రోజు తర్వాత తీస్తే పెసలు చక్కగా మొలకలు వస్తాయి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మొలకలు వచ్చిన పెసలు, ఒక స్పూన్ మెంతులు, కొన్ని ఉల్లి పాయ ముక్కలు, అర కప్పు కొబ్బరి పాలు, పావు కప్పు బియ్యం నీరు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటే ప్యాక్ సిద్ధమైనట్టే.ఇప్పుడు ఈ ప్యాక్‌ను హెయిర్‌కు ఎలా వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదట తలకు రెగ్యులర్ ఆయిల్‌ను అప్లై చేసి.ఆ తర్వాత తయారు చేసుకున్న ప్యాక్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల పట్టించాలి.గంట పాటు షవర్ క్యాప్ పెట్టేసుకుని.ఆపై కెమికల్స్ లేని షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి.
ఇలా వారంలో ఒక్కసారి చేశారంటే జుట్టు క్రమ క్రమంగా పెరుగుతుంది.అదే సమయంలో హెయిర్ పాల్, హెయిర్ డ్యామేజ్ వంటి సమస్యలు దూరం అవుతాయి.