అక్టోబ‌రు 22 సాయంత్రం 6గంట‌ల‌కు ఆహా లో స్ట్రీమింగ్ కాబోతున్న మ్యాజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ల‌వ్‌స్టోరి

నాగ చైతన్య, సాయి పల్లవి మ్యాజిక్, శేఖర్ కమ్ముల టేకింగ్‌తో ‘లవ్ స్టోరి’ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.సెకండ్ వేవ్ తరువాత బ్లాక్ బస్టర్ అయిన చిత్రంగా ‘ల‌వ్‌స్టోరి’ నిలిచింది.

 Magical Entertainer Love Story Movie Airing In Aha On October 22 At 6pm Details,-TeluguStop.com

ఇక నేడు (అక్టోబర్ 22) ఈ చిత్రం ఆహాలో రాబోతోంది.నేటి సాయంత్రం ఆరు గంటలకు ‘ల‌వ్‌స్టోరి’ ప్రీమియర్ కాబోతోంది.

ఈ క్రమంలో ఆహా టీం పైరసీ చేసే వారిని హెచ్చరించింది.పైరసీని అరికట్టాలి.

అందరూ ఆహాలోనే సినిమాను చూడండి.అది కూడా చాలా తక్కువ ధరలో అందిస్తున్నాం.

రోజుకు ఒక్క రూపాయి చొప్పునే మీకు ఖర్చు అవుతుంది.మంచి క్వాలిటీతో సినిమాకు మీకు అందిస్తున్నాం.

ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే డబ్బులు పెట్టి మనం ఎలా సినిమా చూస్తామో ఈ రోజు సాయంత్రం ఆరుగంటలకు ఆహాలో లవ్ స్టోరీని చూడండి.ఆహాలో సబ్ స్క్రిప్షన్ చేసుకుని సినిమాను చూడండి’ అని ఆహా టీం కోరింది.

ఈ సంద‌ర్భంగా ఏర్ప‌టు చేసిన విలేక‌రుల స‌మావేశంలో చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన ‘ల‌వ్‌స్టోరి’ చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్స్‌లో మా ప్రయత్నాన్ని ఆశీర్వదించారు.ఇప్పుడు సినిమా తెలుగు ఓటీటీ మాధ్యమమైన ‘ఆహా’లో ఈరోజు సాయంత్రం 6 గంటకు అందుబాటులోకి వస్తుంది.

ఆహాలోనూ ఈ సినిమాను ప్రేక్షకులు చూసి అనందించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Telugu Sekhar Kammula, Love Story Aha, Love Story, Nagachaitanya, Saipallavi, Ah

హెచ్‌వీ చలపతి రాజు మాట్లాడుతూ.‘బొబ్బిలి రాజా’ చిత్రం నుంచి పైరసీని అడ్డుకునేందుకు మేం ప్రయత్నిస్తున్నాం.ఆహా ఫ్లాట్ ఫాం నుంచి వస్తున్న సినిమాల పైరసీని కట్టడి చేసేందుకు శ్రమిస్తున్నాం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫాం అయిన ఆహాను అందరూ అభినందించాలి.అందరూ సబ్ స్క్రైబ్ చేసుకుని చూడాలి.పైరసీని ఎంకరేజ్ చేయకూడదు.కానీ కొందరు కేబుల్ ఆపరేటర్లు మాత్రం పైరసీ చేస్తున్నారు.

ఈ రోజు ఆహాలో లవ్ స్టోరీ రాబోతోంది.దీన్ని ఎవరైనా పైరసీ చేశారని తెలిస్తే అది ఎంత పెద్ద వారైనా సరే కేసులు పెడతాం’’ అని హెచ్చ‌రించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube