అతడి రక్తంలో పుట్టగొడుగులు.. ఎలా పెరిగాయాంటే?

టెక్నాలజీ పెరిగిపోవడంతో కొందరు ప్రతి దానికి ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారు.ఫ్యాషన్, విద్య, వైద్యం ఇలా ప్రతిదాని గురించి నెటింట్లోనే సెర్చ్ చేస్తున్నారు.

 Magic Mushrooms, Man Blood, Organ Failure, Viral In Internet,blood Infution,anti-TeluguStop.com

అక్కడ పొందుపరిచిన వాటిని గుడ్డిగా ఫాలో అవుతున్నా వారు కూడా ఉన్నారు.అయితే వైద్యం విషయంలో కూడా ఇలానే నెట్‌లో చూసి సొంత వైద్యం చేసుకున్న ఓ వ్యక్తి రక్తంలో పుట్టగొడుగులు పుట్టుకొచ్చాయి.

దీంతో అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించింది.దీంతో అతడు ప్రాణాల కోసం పోరాటం చేయాల్సి వచ్చింది.

ఇందుకు సంబంధించిన వివరాలను జర్నల్ ఆఫ్ ది అకాడమీ ఆప్ కన్సల్టెషన్ లియసన్ సైకియాట్రీలో ప్రచురించారు.అయితే సొంత వైద్యంతో అనారోగ్యం బారినపడ్డ వ్యక్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

బై పోలార్ డిజార్డర్, ఇతర మానసిక వ్యాధులతో బాధపడుతున్న ఓ 30 ఏళ్ల వ్యక్తి డాక్టర్ వద్ద చికిత్స కోసం మందులు తీసుకున్నాడు.అయితే మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు మ్యాజిక్ మష్‌రూమ్స్(సిలోసెబిస్ పుట్టగొడుగులు) ఉపయోగపడతాయని ఇంటర్నెట్‌లో అతడి ఒక సమాచారం లభించింది.

దీంతో వాటిని తీసుకుని తన అనారోగ్యాన్ని దూరం చేసుకోవాలని భావించాడు.ఈ క్రమంలోనే సొంత వైద్యం చేసుకున్నాడు.ఆ పుట్టగొడుగులకు తన రక్తంలో ఇంజెక్ట్ చేసుకోవాలని అనుకున్నాడు.

Telugu Magic Mushrooms, Organ Failure-Latest News - Telugu

ఈ క్రమంలోనే పుట్టగొడుగులను మరగబెట్టి టీలాగా తయారు చేశారు.అనంతరం ఆ మిశ్రమాన్ని ఇంజక్షన్ ద్వారా తన రక్తంలోకి ఎక్కించుకున్నాడు.అయితే ఇలా జరిగిన కొద్ది గంటలకే అతడు అస్వస్థతకు గురయ్యాడు.

దీంతో అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.అక్కడ అతనికి వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించారు.

అతని లివర్ డ్యామేజ్ అయినట్టు వైద్యులు గుర్తించారు.కిడ్నీ కూడా సక్రమంగా పనిచేయడం లేదని తేలింది.

అలాగే శరీరంలోని అన్ని అవయవాల పనితీరు క్షీణిస్తుందని కనుగొన్నారు.అనంతరం అతనికి నిర్వహించిన రక్తపు పరీక్షల ఫలితాలు చూసి వైద్యులే షాక్ తిన్నారు.

రక్తంలో పుట్టగొడుగులు పెరగడం ప్రారంభమైందని, ఫంగల్ ఇన్ఫెక్షన్ జరిగినట్టు వైద్యులు గుర్తించారు.

Telugu Magic Mushrooms, Organ Failure-Latest News - Telugu

దీంతో అతడిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.యాంటి బయోటిక్స్, యాంటి ఫంగల్స్ అందించారు.దాదాపు 22 రోజులు పాటు హాస్పిట‌ల్‌లోనే గడపాల్సి వచ్చింది.

అయితే ప్రస్తుతానికి అతడు బతికి బయటపడినప్పటికీ దీర్ఘ కాలం పాటు యాంటి బయోటిక్స్, యాంటి ఫంగల్స్ వాడాల్సి ఉంటుంది.కాగా, సిలోసెబిన్ పుట్టగొడుగులను మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించే ఔషధ లక్షణాలు ఉన్నాయో తెలుసుకోవడానికి పరిశోధకులు చాలా కాలంగా పరిశోధనలు జరుపుతున్నారు.

కానీ వాటిని టీ రూపంలో శరీరంలోకి డైరెక్ట్‌గా ఇంజెక్ట్ చేసుకోవాలని పరిశోధకులు ఎక్కడ ప్రస్తావించలేదు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube