మాఘ గుప్త నవరాత్రులు అంటే ఏమిటో తెలుసా..?

Magha Gupta Navratri 2021 Check Out Complete List And Significance

సాధారణంగా దేవీ నవరాత్రుల గురించి మనం వినే ఉంటాం.కానీ చాలామందికి మాఘమాసంలో వచ్చేటటువంటి గుప్త నవరాత్రుల గురించి తెలియకపోవచ్చు.

 Magha Gupta Navratri 2021 Check Out Complete List And Significance-TeluguStop.com

మన హిందూ ఆచారం ప్రకారం తెలుగు నెలల్లో పదకొండవ నెల అయిన మాఘమాసం ఎంతో పవిత్రమైనది.ఈ మాఘమాసంలో ఉదయం నదీ స్నానాలు ఆచరించి ఆ విష్ణుమూర్తి పూజ చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సుఖసంతోషాలతో ఉంటారని భావిస్తారు.

ఇంతటి పవిత్రమైన ఈ నెలలో వచ్చేటటువంటి నవరాత్రులు కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉంటాయి.వీటిని గుప్త నవరాత్రులు అని పిలుస్తారు.

 Magha Gupta Navratri 2021 Check Out Complete List And Significance-మాఘ గుప్త నవరాత్రులు అంటే ఏమిటో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఏడాది గుప్తనవరాత్రులు ఫిబ్రవరి12 నుంచి 21వ తేదీ వరకు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.మరి ఈ నవరాత్రుల విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

తొమ్మిది రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకునే ఈ రాత్రులను నవరాత్రులు అని పిలుస్తారు.

ఈ తొమ్మిది రోజులపాటు శక్తి స్వరూపిణి అయిన దుర్గామాతను ఎంతో ఘనంగా వివిధ రూపాలలో పూజిస్తారు.చైత్ర , శారద నవరాత్రుల సమయంలో ఎక్కువగా దేవీ నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు.

కానీ మాఘ, ఆషాఢ మాసాలలో వచ్చే ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అని పిలుస్తారు.ఈ నవరాత్రుల లో భాగంగా మొదటి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి పూజలు జరుపుతారు.

మాఘమాసం వేకువ జామునే నిద్రలేచి నదీస్నానమాచరించి అమ్మవారిని పూజిస్తారు.ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఈ రూపాలలో పూజిస్తారు.

1) మొదటిరోజు కాళికాదేవి అలంకరణలో పూజిస్తారు.

2) రెండవ రోజు త్రిపుర తార దేవి అలంకరణలో అమ్మవారిని పూజిస్తారు.

3) మూడవరోజు సుందరి దేవి అలంకరణ.

4) నాలుగవ రోజు భువనేశ్వరి దేవి.

5) ఐదో రోజు మాతా చిత్రమాస్తా త్రిపుర దేవి అలంకరణ.

6) ఆరవ రోజు స్కంద మాత అలంకరణలో పూజిస్తారు.

7) ఏడవ రోజు మధుమతి దేవి అలంకరణలో పూజిస్తారు.

8) ఎనిమిదో రోజు మాతా బాగలముఖి దేవి అలంకరణలో పూజిస్తారు.

9) తొమ్మిదో రోజు మాతంగి కమలాదేవిగా అలంకరించి పూజిస్తారు.

అయితే ఈ గుప్త నవరాత్రులను కొన్ని ప్రాంతాలలో మాత్రమే జరుపుకుంటారు.

ఎక్కువగా గుజరాత్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఈ గుప్త నవరాత్రులను ఎంతో వేడుకగా నిర్వహించుకుంటారు.

#MaghaGupta #Devi Navratri #Pooja #Magha Masam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube