మ్యాగీని వదలని ప్రభుత్వం

బహుళజాతి సంస్థ నెస్లే ఇండియా ఉత్పత్తి అయిన పాపులర్ ఫుడ్ మ్యాగీని కేంద్రం వదిలిపెట్టడం లేదు.ఈ ఏడాది జూన్ నెలలో మ్యాగీని నిషేధించిన సంగతి తెలుసు.

 Maggi Exceeded Lead Content, Violated Labelling Rules-TeluguStop.com

దీనిలో లెడ్ శాతం అనుమతించిన దాని కంటే ఎక్కువగా ఉందని, మొనోసోడియం గ్లుతామెత్ కు సంబంధించిన లేబులింగ్ నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించిన కేంద్రం మ్యాగీపై నిషేధం విధించింది.వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పరీక్ష ఫలితాలు మ్యాగీ నూడుల్స్ తయారీలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని తెలియచేసాయని ప్రభుత్వం తెలిపింది.

మార్కెట్ నుంచి మ్యాగీ నూడుల్స్ తొలగించాలని నెస్లే ఇండియా సంస్థకు చెప్పమని పార్లమెంటులో మంగళవారం ప్రభుత్వం తెలియచేసింది.భారతీయ మార్కెట్లోకి మళ్ళీ రావాలనే నెస్లే ఇండియా ప్రయత్నాలను ప్రభుత్వం సాగనివ్వడం లేదు.

మ్యాగీ నూడుల్స్ ను విదేశాల్లో టెస్ట్ చేసినప్పుడు ఇది ఆరోగ్యానికి హాని చేసేది కాదని తేలింది.ఇది సురక్షితమినదేనని విదేశీ ప్రయోశాలలు తేల్చాయి.

అయినా ఇండియా నమ్మడంలేదు.మ్యాగీ నూడుల్స్ దేశంలో చాలా పాపులర్.2 నిమిషాల్లో తయారయ్యే ఆహార పదార్ధం ఇది.ప్రధానంగా పిల్లలకు చాలా ఇష్టం.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube