ఈ మాఫియా డాన్ తెలుగు హీరోయిన్లని దారుణంగా వాడుకుని....  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రముఖ ఫ్యాక్షన్ లీడర్ “మద్దెల చెరువు సూరి” హత్య అప్పట్లో ఎంతగా కలకలం సృష్టించిందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే  అప్పటికే పలు కేసులలో నిందితుడిగా ఉన్నటువంటి మద్దెల చెరువు సూరి జైలు శిక్ష అనుభవించి బయటకు రాగానే తన అనుచరుడు భాను కిరణ్ దారుణంగా కాల్చి చంపాడు.

TeluguStop.com - Mafia Don Bhanu Kiran Harassed To The Telugu Heroines

 ఈ నేరం రుజువు కావడంతో భాను కిరణ్ కి కోర్టు జీవిత ఖైదు కూడా విధించింది.అయితే ఆస్తులు విషయంలోనే మద్దెల చెరువు సూరికి మరియు నిందితుడు భాను కిరణ్ కి మధ్య పలు వివాదాలు తలెత్తడంతో భాను కిరణ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అప్పట్లో పోలీసుల విచారణలో అంగీకరించాడు.

అంతేగాక భాను కిరణ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు తగాదాల సెటిల్ మెంట్లలో కూడా బాగానే ఆరితేరి డబ్బులు సంపాదించాడు. ఈ క్రమంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమకి చెందినటువంటి పలువురు సినీ నిర్మాతలతో భాను కిరణ్ కి సత్సంబందాలు ఉండేవి.

TeluguStop.com - ఈ మాఫియా డాన్ తెలుగు హీరోయిన్లని దారుణంగా వాడుకుని….-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

 ఈ క్రమంలో భాను కిరణ్ నిర్మాతలకి డబ్బులు ఇస్తుండేవాడని దీంతో అప్పుడప్పుడు తాను డబ్బు సహాయం చేసినటువంటి నిర్మాతలు నిర్మిస్తున్న చిత్ర షూటింగులకు వెళ్లి హీరోయిన్లని వేధించేవాడని కూడా పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడట.

ఇందులో దాదాపుగా ముగ్గురు హీరోయిన్లని భాను కిరణ్ దారుణంగా లైంగికంగా వేధించాడని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కానీ భాను కిరణ్  వాడుకున్నటువంటి హీరోయిన్లకి మాత్రం లక్షల రూపాయల ఆస్తులను ముట్టజెప్పినట్లు కూడా కొందరు చర్చించుకుంటున్నారు.కాగా ప్రస్తుతం భాను కిరణ్ జైలుకు వెళ్లడంతో ఆ సినీ నిర్మాతలు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే భాను కిరణ్ జైలులో ఉన్నప్పటికీ భూదందాలు, కబ్జాలు తదితర అంశాలకి సంబందించిన విషయాలను హైదరాబాద్ ప్రముఖ గ్యాంగ్ స్టర్ నయీమ్ తో చర్చిస్తుండేవాడు.అందువల్లనే ఆ మధ్య భాను కిరణ్ ని ఒక చోటు నుంచి మరో జైలుకి మార్చారు.

#MafiaDon #MaddelaCheruvu #Bhanu Kiran #MaddelaCheruvu #Mafia Don

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు