వింత గ్రామం : పిల్లలను ప్రసవించొద్దు, శవాలను పూడ్చి పెట్టొదు, జంతువులను పెంచవద్దు.. అన్నింటికి పక్క గ్రామాలకే

ఎంత చిన్న గ్రామంలో అయిన ఏదో ఒక రకం జంతువులు ఉంటూనే ఉంటాయి.కొన్ని గ్రామాల్లో అనేక రకాల జంతువులు ఉంటాయి.

 Mafi Dove African Village Where Children Taboo And Ni Burial Ground-TeluguStop.com

ఇక ప్రతి గ్రామంలో కూడా స్మశానవాటిక అనేది ఖచ్చితంగా ఉంటుంది.ఊర్లో ఎవరు మరణించినా కూడా అక్కడ దహణ సంస్కారాలు చేస్తూ ఉంటారు.

ఇక ప్రతి గ్రామంలో కూడా మహిళలు ప్రసవించడం కనిపిస్తూనే ఉంటుంది.ఈ మూడు జరగని ఊరు ఈ ప్రపంచం మీద ఎక్కడ ఉండదని అంతా అనుకుంటారు.

కాని దక్షిణాఫ్రికాలోని ఒక గ్రామంలో మాత్రం ఈ మూడు కఠినంగా నిషేదించారు.

ఆ ఊర్లో ఏ ఒక్క మహిళ కూడా ప్రసవించదు, ఏ ఒక్కరు కూడా జంతువులను పెంచరు, ఏ ఒక్క శవాన్ని కూడా ఆ గ్రామంలో పూడ్చి పెట్టడం కాని, కాల్చడం కాని చేయరు.

ఇవన్ని జరుగకుండా ఒక ఊరు ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా, అన్ని జరుగుతాయి కాని ఊరికి వెలుపల.లోపల మాత్రం అన్ని బహిష్కారం అయినా బయట మాత్రం అన్నింటికి అనుమతి ఉంటుంది.

మహిళలు గర్బం దాల్చడం అక్కడ తప్పు కాదు.కాని గర్బవతి ఆ గ్రామంలో పిల్లలను ప్రసవించడం తప్పు, గర్బవతి అయిన మహిళలు ఏడు లేదా ఎనిమిది నెలల గర్బం సమయంలో వేరే ఊరుకు వెళ్లాల్సి ఉంటుంది.

అక్కడ ప్రసవించిన తర్వాత పుట్టిన పిల్ల లేదా పిల్లాడికి బొడ్డు ఊడే వరకు అక్కడే ఉండి, ఆ తర్వాత గ్రామంలోకి రావాల్సి ఉంటుంది.

గ్రామంలో జంతువులు కనిపించవు.కాని గ్రామస్తులు సాదారణ జనాలు తిన్నట్లుగానే అన్ని రకాల జంతువుల మాసంను తింటారు.అయితే ఆ జంతువుల మాసాంను వేరే గ్రామాల నుండి తెస్తారు.

ఒక వేళ అదే గ్రామంలో కోయలి అంటే ఆ రోజు తీసుకు వచ్చి, అదే రోజు కొయ్యాల్సి ఉంటుంది.ఎట్టి పరిస్థితుల్లో ఒక రోజుకు మించి జంతువులు ఆ గ్రామంలో ఉండకూడదు.

ఇక చనిపోయిన శవాలను పక్క గ్రామంకు తీసుకు వెళ్లి మరీ ఖననం చేస్తారు.పక్క గ్రామాలతో ఉన్న ఒప్పందం కారణంగా డబ్బులు ఇచ్చి మరీ వేరే గ్రామాల్లో శవాలను పూడ్చి పెడుతూ ఉన్నారు.

దక్షిణాఫ్రికాలోని ఘనాలో ఉన్న మాఫీ డవ్‌ అనే ఈ గ్రామం ప్రపంచంలోనే అత్యంత వింత గ్రామంగా పేరు దక్కించుకుంది.ఈ గ్రామంలో దాదాపు 5 వేల మంది జనాబా ఉంటారు.ప్రతి ఒక్కరు కూడా గ్రామంలోని ఈ మూడు కట్టుబట్లాను పాటించాల్సిందే.కాదని ఉల్లంఘిస్తే గ్రామ పెద్దల శిక్షకు అర్హులు అవుతారు.చాలా ఏళ్ల క్రితం ఒక గ్రామస్తుడికి దేవత ఈ విషయం చెప్పడం వల్ల అప్పటి నుండి గ్రామంలో ఆ మూడును నిషేదించినట్లుగా స్థానికులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube