పెళ్లి పత్రికపై క్యూఆర్ కోడ్.. చదివింపుల కోసం ప్రత్యేకం

లాక్ డౌన్ కి ముందు పెళ్లి వేడుకలు అంటే ఎంతో ఘనంగా జరిగేవి.సెలబ్రిటీ కుటుంబాలలో వివాహాలు అంటే కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టేవారు.

 Madurai Couple Prints Qr Code On Wedding Card, Marriages, Corona Effect, Technol-TeluguStop.com

అలాగే సాధారణ ప్రజలు కూడా పెళ్లి వేడుకని పెద్ద పండగా చేసుకునేవారు.అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో చాలా మంది వీలైనంత వరకు లిమిటెడ్ గా అతిథులని ఆహ్వానిస్తూ పెళ్లి చేసుకుంటున్నారు.

కొంత మంది అయితే కేవలం కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి తంతుని ముగించేసుకుంటున్నారు.కరోనా నుంచి జాగ్రత్తలు పడటానికి ఈ పద్ధతిని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు.

అయితే పెళ్లి వేడుక అంటే అతిథుల చదివింపులు కచ్చితంగా ఉంటాయి.వివాహానికి వచ్చే అతిథులు బహుమతుల రూపంలోనే, డబ్బుల రూపంలోనో చదివింపులు చేస్తూ ఉంటారు.

దీని కోసం గ్రామీణ ప్రాంతాలలో పుస్తకాలు వాడేవారు.అయితే తాజాగా ఓ జంట టెక్నాలజీని ఉపయోగించుకుంది.

పెళ్ళికి వచ్చేవారు చదివింపులు డిజిటల్ లో చేసే విధంగా ఏకంగా పెళ్లి పత్రికపై క్యుఆర్ కోడ్ ని కూడా ప్రచురించారు.ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

త‌మిళ‌నాడులోని మ‌ధురైలో ఓ కుటుంబం వెరైటీ పెళ్లి ప‌త్రిక‌ను ప్ర‌చురించింది.త‌మ కూతురి పెళ్లి కోసం వివాహ ముహూర్త ఆహ్వాన ప‌త్రిక‌పై క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు.

పెళ్లిన వ‌చ్చిన అతిథులు కానీ, రాలేని వారు కాని ఇంటి నుంచే ఆ క్యూర్ కోడ్‌ల ద్వారా పెళ్లి క‌ట్నాల‌ను ఇచ్చుకునే అవ‌కాశం క‌ల్పించారు.కొత్త జంట‌కు కానుక‌లు ఇవ్వాల‌నుకున్న వారు గూగుల్ పే లేదా ఫోన్‌పే ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి అమౌంట్‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేసే వీలు క‌ల్పించారు.

ఇలా చేయడం ద్వారా పుస్తకంలో పేర్లు నమోదు చేసే అవకాశం తప్పుతుంది.అలాగే పెళ్లి చదివింపులు నేరుగా బ్యాంక్ ఎకౌంటు లోకి జమ అయిపోతాయి.

ఈ పెళ్లి వేడుకకి ౩౦ మంది అతిథులు రాగా అందరూ కూడా ఈ క్యుఆర్ కోడ్ ఉపయోగించి చదివింపులు చేసినట్లు తెలుస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube