హీరో విశాల్ కు ఝలక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు....విషయమేంటంటే...!

హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది.హీరో విశాల్,డైరెక్టర్ ఎం.

 Madras High Court Issues Notice To Hero Vishal, Madras High Court, Chakra, Actio-TeluguStop.com

ఎస్.ఆనంద్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘చక్ర’ ను ఓటీటీ లో రిలీజ్ చేసే విషయంలో మద్రాస్ హైకోర్టు నటుడు విశాల్ కు అలానే డైరెక్టర్ ఆనందన్ కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.అసలు కోర్టు ఎందుకు ఓటీటీ రిలీజ్ పై నోటీసులు అందించింది అన్న వివరాల్లోకి వెళితే… విశాల్ హీరోగా సుందర్‌.సి దర్శకత్వంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ నిర్మించిన చిత్రం ‘యాక్షన్’‌.అయితే ఈ సినిమా నిర్మాణం కోసం రూ.44 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయట.ఈ సినిమా విడుదల సమయంలో రూ.20 కోట్ల వరకు హీరో విశాల్‌ గ్యారెంటీ‌ ఉండేలా అగ్రిమెంట్స్‌ కూడా రాసిచ్చాడట.అయితే అనుకున్న రేంజ్ లో ఈ చిత్రం కలక్షన్స్ సాధించలేకపోయింది.విశాల్ నటించిన ఈ యాక్షన్‌ సినిమా తమిళనాడులో రూ.7.7 కోట్లు వసూలు చేయగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.4కోట్లు మాత్రమే వసూలు చేసింది.దీనితో మిగిలిన నష్టాన్ని భర్తీ చేయడం కోసం విశాల్‌ తన తదుపరి చిత్రాన్ని ఆనంద్‌ దర్శకత్వంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లోనే చేస్తానని అన్నాడట.

అయితే మాట ఇచ్చిన ప్రకారం విశాల్ తన తదుపరి చిత్రం ‘చక్ర’ ను తమ బ్యానర్ లో చేయకుండా విశాల్ తన సొంత బ్యానర్ లోనే చేసుకోవడమే కాకుండా ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేస్తున్నారు దానిని ఆపాలి అంటూ ట్రైడెంట్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టు లో కేసు వేసింది.దీనితో కేసును పరిశీలించిన కోర్టు విశాల్ కు, డైరెక్టర్ ఆనంద్ కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube