అమలాపాల్ మాజీ ప్రియుడికి ఝలక్ ఇచ్చిన కోర్టు!

పలు సినిమాల్లో కధానాయికగా నటించి మెప్పించిన అమలా పాల్ కు మద్రాస్ హైకోర్టు భారీ ఊరట నిచ్చింది.ఆమె వ్యక్తిగత ఫోటోలను షేర్ చేస్తున్న మాజీ ప్రియుడు,గాయకుడు భవిందర్ సింగ్ కు మద్రాస్ కోర్టు ఝలక్ ఇచ్చింది.

 Madras High Court Rules Amala Paul's Ex-boyfriend Bhavninder Singh Against Posti-TeluguStop.com

ఆమె వ్యక్తిగత ఫోటోలను ఆమె అనుమతి లేనిదే షేర్ చేయడానికి వీలులేదని కోర్టు స్పష్టం చేసింది.అయితే అమలాపాల్ కు సంబందించిన వ్యక్తిగత ఫోటోలను ఇటీవల సోషల్ మీడియా లో పోస్ట్ చేసి, వివాహం జరిగినట్లు చిత్రీకరిస్తున్నారు అంటూ భవ్ నిందర్ సింగ్ కు వ్యతిరేకంగా పాల్ కోర్టు ను ఆశ్రయించింది.

Telugu Ad, Al Vijay, Amalapauls, Madras, Madrasamala, Personal-Movie

ఈ నేపథ్యంలో కేసు వివరాలు తెలుసుకున్న కోర్టు సింగ్ అలా ఫోటోలను షేర్ చేయడానికి వీలులేదని స్పష్టం చేసింది.అంతేకాకుండా భవిందర్ సింగ్ పై అమలాపాల్ పరువునష్టం దావా కూడా వేయడం తో దానిని పరిశీలించిన కోర్టు వివరణ ఇవ్వాలి అంటూ భవిందర్ సింగ్ ను ఆదేశించింది.అంతేకాకుండా ఈ కేసును డిసెంబర్ 22కు వాయిదా వేసింది.2014 లో తమిళదర్శకుడు ఏ.ఎల్.విజయ్ ను ప్రేమ పెళ్లి చేసుకున్న అమలాపాల్ ఆ తరువాత కొద్దీ కాలానికే వారిద్దరూ విడిపోయారు.వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడం తో తమ వివాహబంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ 2017 లో విడాకులు తీసుకున్నారు.దీనితో దర్శకుడు ఎ.ఎల్.విజయ్ 2019 లో రెండో వివాహం చేసుకున్నారు.

అయితే ఆ సమయంలోనే అమలా పాల్ కూడా తన జీవితంలోకి ఒకరు వచ్చారు అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన కొద్దీ రోజుల్లోనే పాల్,ముంబై సింగర్ భవిందర్ సింగ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేయడం తో వారిద్దరికీ రహస్యంగా పెళ్లి జరిగింది అంటూ ప్రచారం జరిగింది.అయితే అది వృత్తి పరంగా దిగిన ఫోటోలే తప్ప వారికి ఎలాంటి రహస్య వివాహం జరగలేదని అమలాపాల్ స్పష్టం చేశారు.

అయితే ఒకప్పుడు సన్నిహితంగా అమలాపాల్,భవిందర్ సింగ్ లు ఇద్దరూ కూడా మనస్పర్థలు రావడం తో విడిపోయినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube