'గేదె'ను చూసుకోవడానికి ఆ పోలీస్ ఏకంగా ఉద్యోగానికే..?

కొన్ని కొన్ని సార్లు జరిగిన ఘటనలు చూసి ఇది నిజమేనా అని నమ్మాలేము.ఇక్కడ జరిగిన ఘటన కూడా ఇలాంటిదే.

 Police Constable, Buffalo, Leave Application,madhya Pradesh,madhya Pradesh Cop A-TeluguStop.com

ఆ వ్యక్తి పోలీస్ జాబ్ లో కొనసాగుతున్నాడు.కానీ పోలీసు ఉద్యోగానికి సెలవు పెట్టి ఏకంగా గేదెను చేసుకోవాలని అనుకున్నాడు.

పోలీస్ గేదెలను చూసుకోవడం ఏమిటి అని ఆశ్చర్య పోయినప్పటికీ ఇది నిజమే.

తన ఇంటి వద్ద ఉన్న గేదెలను చూసుకోవడానికి తనకు సెలవు ఇప్పించాలి అంటూ అధికారులకు విన్నవించాడు ఇక్కడొక పోలీస్ కానిస్టేబుల్.

ఇది విని అటు అధికారులు కూడా కాస్త షాక్కు గురయ్యారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ఈ ఆసక్తికర ఘటన.కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి… తన ఇంటి వద్ద ఉన్న గేదె బాగోగులు చూసుకోవడానికి సెలవు ఇప్పించాలంటూ అధికారులను కోరుకున్నాడు.

దీనికి కారణం కూడా వివరించాడు సదరు కానిస్టేబుల్.

తన ఇంటి వద్ద ఉన్న గేదెను రోజూ చూసుకునే తన తల్లి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆస్పత్రిలో చేర్పించామని… దీంతో ఆ గేదె ఒంటరిగా అయిందని… ఈ మధ్యనే ఆ గేదె ఒక బుల్లి గేదెకు కూడా జన్మనిచ్చిందని… దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత తనదే అంటూ వివరించాడు.తాను చిన్నప్పటి నుంచి ఆ గేదె పాలు తాగే పెరిగానని… ఇప్పుడూ ఆ గేదెను చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది అంటూ ఉన్నతాధికారులకు సెలవు కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు ఆ కానిస్టేబుల్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube