వైరల్ వీడియో : 35 అడుగుల ఎత్తు నుండి పడ్డా పిల్లోడికి చిన్న గాయం కాలేదు, ఎలాగో తెలుసా?  

Madhya Pradesh Child Falls Off From 35 Feets And Saved By Rickshaw - Telugu Child Falls Off From 35 Feets, Madhya Pradesh, Madhya Pradesh Child, Saved By Rickshaw, Viral In Social Media, Viral News Updates

ఈ భూమి మీద నూకలు ఉంటే యమ ధర్మరాజు వచ్చి తీసుకు వెళ్లాలనుకున్నా ప్రాణం పోదు అంటారు.ఎంతో మంది చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన వారు ఉంటారు.

Madhya Pradesh Child Falls Off From 35 Feets And Saved By Rickshaw

భూమి మీద నూకలు చెల్లి పోయిన వారు చిన్న గులకరాయి తలిగినా చనిపోతారు.చిన్న బురద గుంటలో పడ్డా చనిపోతారు.

చిన్న పిట్టగోడ నుండి పడ్డా కూడా చనిపోతారు.కాని ఇంకా ఆయుస్సు తీరని వారు సముద్రంలో పడ్డా తిరిగి వస్తారు.

వైరల్ వీడియో : 35 అడుగుల ఎత్తు నుండి పడ్డా పిల్లోడికి చిన్న గాయం కాలేదు, ఎలాగో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image

వంద అంతస్తుల మేడ మీద నుండి కింద పడ్డా కూడా అదృష్టం కొద్ది బతికి బట్ట కడతారు.

ఇప్పుడు నేను చెప్పబోతున్న కుర్రాడు సెకండ్‌ రకం అయ్యి ఉంటాడు.

ఈ బుడ్డోడికి ఈ భూమి మీద ఇంకా నూకలు ఉన్నట్లుగా ఉన్నాయి.ఏకంగా 35 అడుగుల ఎత్తు నుండి కింద పడ్డా కూడా చిన్న గాయం కూడా కాలేదు.

అదృష్టవశాత్తు ఈ కుర్రాడు ఒక రిక్షాపై పడటం, ఆ రిక్షాలో ఉన్న పరుపు అతడికి చిన్న గాయం కూడా కాకుండా చేశాయి.కొన్ని సెకన్లు తేడా అయితే ఆ పిల్లాడి ప్రాణాలు గాల్లో కలిసేవి.

కాని అతడికి ఇంకా బతికే ఆయుషు ఉంది కనుకే అతడు ఆ రిక్షాలో పడ్డాడు.

 మద్యప్రదేశ్‌లోని తికంగడ్‌ జిల్లాకు చెందిన ఒక గ్రామంలో మేడపై ఆడుకుంటున్న ఒక చిన్న బాలుడు 35 అడుగుల ఎత్తు నుండి కింద పడ్డాడు.ఆ సమయంలో సరిగ్గా ఒక రిక్షా కిందుగా వెళ్తుంది.సరిగ్గా ఆ రిక్షా వెనుక బాగంలో ఎలాంటి గాయం కాకుండా ఆ కుర్రాడు పడ్డాడు.

దాంతో అతడికి చిన్న గాయం కూడా కాలేదు.ఆ సమయంలో ఆ బాలుడు కనీసం ఎడిచింది కూడా లేదు.

మొత్తానికి ఆ బాలుడి అదృష్టానికి అంతా అవాక్కవుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు