కాకి నమూనాలతో బైక్ పై 350 కిలోమీటర్లు.. ఎందుకంటే?

ప్రస్తుతం ప్రపంచంలో వస్తున్న వింత వైరస్ లకు వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారు.కాగా ఇటీవలే బర్డ్ ఫ్లూ సంబంధించిన వైరస్ గురించి కొన్ని విషయాలు బయటకు రాగా.

 Madhya Pradesh Vet Goes 350 Km On Bike With Crow Samples, Madhya Pradesh Vet ,35-TeluguStop.com

దానికి సంబంధించిన పక్షులతో వైద్య నిపుణులు పరీక్షలు చేస్తున్నారు.ఈ విధంగా ఓ వ్యక్తి పరీక్షకు సంబంధించిన విషయంలో దాదాపు 350 కిలోమీటర్లు ప్రయాణించి కాకి నమూనాలను అందించిన విషయం అందరిని ఆకట్టుకుంది.

మధ్యప్రదేశ్ లో పృథ్వీ పూర్ ప్రాంతానికి చెందిన ఓ అసిస్టెంట్ పశువైద్యాధికారి ఆర్ పీ తివారి.ఇతని వయస్సు 54 ఏళ్లు.ఈ నేపథ్యంలో ఆయన కు వేరే ప్రాంతం నుండి కాకి నమూనాలతో పిలుపు రాగా వెంటనే తన కుమారుడి బైక్ పై 350కిలోమీటర్ల దూరం ప్రయాణించారు.

Telugu Km Bike, Crow Samples-Latest News - Telugu

భోపాల్ ప్రాంతంలో ఉన్నతాధికారులు బర్డ్ ఫ్లూ కు సంబంధించిన విషయంలో కాకి నమూనాలను తీసుకొని తివారి ను రమ్మని కోరారు.దీంతో తివారి కాకి నమూనాలను సేకరించి తను ఉండే చోట నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న టికమ్ గఢ్ కు వెళ్లాడు.కాగా అక్కడ తను ఎక్కాల్సిన బస్సు వెళ్లిపోగా.

ఏమి చేయలేక రైలులో వెళ్దామని అనుకోగా ఆ రాత్రి రైలు టికెట్లు దొరకకపోవడంతో ఇరుకులో పడ్డాడు.

కాగా ఉన్న రెండు రవాణా అవకాశాలు లేకపోయే సరికి.

తన కుమారుడి మోటార్ సైకిల్ పైన వెనకాల కూర్చొని భోపాల్ కు వెళ్ళాలని అనుకున్నాడు.దీంతో ఆ మోటార్ సైకిల్ పై అంత దూరం ప్రయాణించి అధికారులకు కాకి నమూనాలను అందించాడు.

కాగా ఈ విషయం తెలుసుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోషల్ మీడియా ద్వారా తివారిని అభినందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube