హీరో రేంజ్ లో స్టంట్ చేసిన పోలీస్, చివరికి

సినిమాలల్లో హీరోలు గాల్లోకి ఎగిరి మరీ ఫైట్స్ చేస్తూ ఉంటారు.డూప్ లు తాడుల సాయం తో వారి తిప్పలు వారు పడుతూ ఉంటారు.

 Madhya Pradesh, Sub Inspector, Singham Stunt ,cop, Fine,ajay Devgan,madhya Prade-TeluguStop.com

ఎదో హీరోలు అలా చేసారు కదా అని మనం కూడా రియల్ లైఫ్ లో కూడా ఆలా చేయడానికి ప్రయత్నించామో ఇక అంతే లేని పోనీ తలనొప్పులు తెచ్చుకోవడమే.సరిగ్గా అలాంటి పనే చేశారు ఒక పోలీసు అధికారి.

ఏ సినిమా చూసి స్ఫూర్తి పొందారో ఆ పోలీస్ సార్ నడుస్తున్న రెండు కార్ల పై తన కాళ్లను పెట్టి నిల్చున్నాడు.నిజంగా ఆ స్టంట్ చూస్తే మాత్రం ఎవరైనా ఆశ్చర్యపోతారు.

నడుస్తున్న కార్ల పై అలా కాళ్లు పెట్టి నిల్చొని కొంత దూరంగా కార్లను అలాగే నడిపించారు.ఇది అధికారుల దృష్టిన ప‌డ‌డంతో ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడు.

వివ‌రాల‌లోకి వెళితే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కి చెందిన స‌బ్ ఇన్స్పెక్టర్ మనోజ్ యాద‌వ్ తాజాగా అజ‌య్ దేవ‌గ‌ణ్ సింగంలోని సాంగ్‌తో‌ స్టంట్‌ని ప్ర‌య‌త్నించాడు.పోలీస్ డ్రెస్‌తో క‌ళ్ళ‌కి అద్దాలు పెట్టుకొని ఒక కారు మీద ఒక కాలు , రెండో కారు మీద మ‌రో కాలు ఉంచి బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాడు.

ఆయ‌న స్టంట్‌కి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.దీనితో ఆ వీడియో కాస్త అధికారుల దృష్టికి వెళ్లడం తో ట్రాఫిక్ రూల్స్ అత్రిక‌మించిన కార‌ణంగా అత‌నిని స‌స్పెండ్ చేస్తూ రూ.5000 జ‌రిమానా కూడా విధించినట్లు తెలుస్తుంది, న‌లుగురికి ఆద‌ర్శంగా ఉండాల్సిన పోలీసులు ఇలా చేస్తే యువ‌త ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉందని నెటిజ‌న్స్ అంటున్నారు.కాగా, అజ‌య్ దేవ‌గ‌ణ్ 90ల‌లో వ‌చ్చిన ఫూల్ ఔర్ కాంతీలో ఇలానే రెండు బైకుల‌పై స్టంట్స్ చేసి ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు పొందాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube