ఆవుపేడ కొంటామంటున్న ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌మెంట్‌..

ఒక‌ప్ప‌టికి ఇప్ప‌టిక వ్య‌వ‌సాయంలో ఎన్నో మార్పులు వ‌చ్చాయి.ఒక‌ప్పుడు అత్యంత ప్రాచీన ప‌ద్ధ‌తుల్లో స‌హ‌జ సిద్ధంగా వ్య‌వ‌సాయం చేశేవారు.

 Madhya Pradesh State Government That Is Buying The Cow Dung Details, Cowpea, Mad-TeluguStop.com

కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి.వ్య‌వాస‌యంలో ఎక్కువ‌గా ర‌సాయ‌నాలు వ‌చ్చేశాయి.

అయితే ఇప్ప‌టికీ కొన్ని చోట్ల మాత్రం సేంద్రీయ వ్య‌వ‌సాయం చేస్తూనే ఉన్నారు.ఇప్పుడు ఓ సీఎం కూడా ఇదే విధ‌మైన అడుగులు వేశారు.

మ‌న దేశంలో బీజేపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత హిందుత్వ భావజాలం అన్ని రాష్ట్రాల్లోనూ పెరుగుతూనే ఉంది.కాగా ఆవుకు కూడా అత్యంత ఆద‌ర‌ణ ద‌క్కుతోంది.

ఇప్పుడు మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది.ఆయ‌న రీసెంట్ గా మాట్లాడుతూ ఆవుపేడ, గోమూత్రం ప్రాధాన్యాన్ని గుర్తించాలంటూ పిలుపునిచ్చారు.

వీటితో రైతులకు అధికంగా లాభాలు వ‌స్తాయ‌ని, కాబ‌ట్టి వాటితో తాము ఎరువులను త‌యారు చేస్తామంటూ చెప్పుకొచ్చారు.ఇక ఇందుకోసం ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నామని, త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న కూడా చేస్తామంటూ వివ‌రించారు.

ఆవుపేడను వ్య‌వ‌సాయంలో ఉప‌యోగించే క్రిమి సంహార‌క మందుల‌కు ఉప‌యోగిస్తామంటూ తెలిపారు.

వీటి ద్వారా ఇండ్ల ముందు అలుకు చ‌ల్లుకుంటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని, వాటిని కూడా ప‌రిశీలిస్తున్నామ‌ని తెలిపారు.

Telugu Buy Cow Dung, Cmshivraj, Dhannaya, Madhya Pradesh-Latest News - Telugu

ఇప్ప‌టికే త‌మ రాష్ట్రంలోని శ్మశాన వాటికల్లో పిడకలతో ద‌హ‌నం చేస్తున్నామ‌ని వివ‌రించారు.త్వ‌ర‌లోనే తామే రైతుల ద‌గ్గ‌రి నుంచి ఆవు పేడ‌ను కొనుగోలు చేస్తామంటూ వివ‌రించారు.ఇందులో భాగంగా చ‌త్తీస్ ఘ‌డ్ లో అమ‌లు చేస్తున్న గోధాన్ నయా యోజన స్కీమ్ ను మ‌ధ్య ప్ర‌దేశ్‌లోనూ అమ‌లు చేస్తామ‌న్నారు.ఈ స్కీమ్ కింద‌ ఆవుపేడను కిలో రూ.2 వ‌ర‌కు కొంటామ‌ని వివ‌రించారు.దీంతో ఆ రాష్ట్ర రైతులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

దీని ద్వారా రైతుల‌కు అద‌న‌పు ఆదాయం వ‌స్తుంద‌ని వ్య‌వ‌సాయ నిపుణులు కూడా చెబుతున్నారు.అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఇంకా చెప్ప‌లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube