వ‌రుడిని ఊరేగించొద్ద‌న్న గూండాలు.. పోలీసులు ఏం చేశారంటే

మ‌న దేశం ఎంత అభివృద్ధి చెందినా స‌రే.ఇంకా చాలా చోట్ల వివ‌క్ష అనేది క‌నిపిస్తూనే ఉంది.

 Madhya Pradesh Police Stood For Dalit Groom March Details, Groom Procession, Viral News, Madhya Pradesh Police ,stood For Dalit Groom , Dalit Groom March , Rahul Meghwal, Gangsters, Social Media,viral, Constitution-TeluguStop.com

అది ప్రాంతం ప‌రంగా అయినా లేదంటే కుల ప‌రంగా అయినా లేదంటే మ‌త ప‌రంగా అయినా క‌నిపిస్తూనే ఉంది.ఆకాశంలోకి రాకెట్ల‌ను పంపించేంత అభివృద్ధి చెందినా కూడా.

ఇంకా ఈ త‌ర‌హా అస‌మాన‌త‌లు మాత్రం తొల‌గిపోవ‌ట్లేదు.అయితే వీటి పేరు మీద చాలా సార్లు దాడులు జ‌రుగుతున్నాయి.

 Madhya Pradesh Police Stood For Dalit Groom March Details, Groom Procession, Viral News, Madhya Pradesh Police ,stood For Dalit Groom , Dalit Groom March , Rahul Meghwal, Gangsters, Social Media,viral, Constitution-వ‌రుడిని ఊరేగించొద్ద‌న్న గూండాలు.. పోలీసులు ఏం చేశారంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అత్యంత హీనమైన దాడుల‌ను కూడా మ‌నం చాలా సార్లు వింటున్నాం.ఇందుకు సంబంధించిన వీడియోలు, వార్త‌లు కూడా నెట్టింట్లో బాగానే వైర‌ల్ అవుతున్నాయి.

ఇలాంటి ఘ‌ట‌నే ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది.అయితే ఈ సీన్ లోకి పోలీసులు ఎంట్రీ ఇవ్వ‌డంతో ఇది కాస్తా రివ‌ర్స్ అయిపోయింది.ఈ ప్రాంతంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ యువ‌కుడికి పెండ్లి నిశ్చ‌యం అయింది.నీముచ్ జిల్లాలోని స‌ర్సి గ్రామంలో ఉండే రాహుల్ మేఘ్వాల్‌కు గ‌త నెల 27న పెండ్లి కుదిరింది.

కాగా ఊర్లోని కొంద‌రు గూండాలు ఆ యువ‌కుడిని ఊరేగిస్తూ ఊరుకోబోమ‌ని, అత‌ను ద‌ళిత వ్య‌క్తి కాబ‌ట్టి దాన్ని అడ్డుకుంటామ‌ని చెప్పారు.దాంతో ఆ కుటుంబీకులు భ‌య‌ప‌డిపోయి పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

Telugu Gangsters, Groom, Madhya Pradesh, Rahul Meghwal-Latest News - Telugu

ఇక క‌లెక్ట‌ర్ కూడా ఆ పెండ్లికి ర‌క్ష‌ణ క‌ల్పించాలని అధికారుల‌ను ఆదేశించారు.దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.పెండ్లి కుమారుడికి అండ‌గా నిల‌బ‌డ్డారు.వంద‌ల మంది పోలీసులు వ‌చ్చి ఆ యువ‌కుడి పెండ్లిని ద‌గ్గ‌రుండి ఘ‌నంగా జ‌రిపించారు.ఇక ఊర్లో కూడా ఆ యువ‌కుడిని గుర్రంపై ఊరేగించారు పోలీసులు.ఇక ఇలా ఊరేగిస్తున్న స‌మ‌యంలో ఆ యువ‌కుడు రాజ్యాంగాన్ని చేతిలో ప‌ట్టుకోవ‌డం విశేషం.

ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ చెక్క‌ర్లు కొడుతోంది.దీనిపై చాలామంది భిన్నంగా స్పందిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube