ముస్లిం పెళ్లి శుభలేఖపై హిందువుల దేవుళ్ళ బొమ్మలు... మతసామరస్యం అంటే ఇదే!

సనాతన భారత దేశంలో హిందూ – ముస్లిం భాయ్, భాయి అన్నారు.అయితే ఈ నినాదానికి తగ్గట్టే అప్పుడప్పుడు మన చుట్టూ అనేక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

 Madhya Pradesh Muslim Man Prints Ganesha And Radha Krishna On Wedding Card Detai-TeluguStop.com

ఇక్కడ హిందూ, ముస్లిం ఎంతో సఖ్యతగా కలిసి ఉంటారు.ముస్లింలు గొప్పగా జరుపుకునే ఉత్సవాలకు హిందువులు వెళ్లి మొక్కుబడులు చెల్లించుకుంటారు.

హిందువులు జరుపుకునే కొన్ని పండగలు, శుభకార్యాల్లో ముస్లింలు సంతోషంగా పాలుపంచుకుంటారు.ఈ క్రమంలోనే మత సామరస్యానికి ప్రతీకగా ఓ ముస్లిం యువకుడు చేసిన పనికి అందరూ హర్షిస్తున్నారు.

అవును.ముస్లింల పెళ్లి శుభలేఖలపై హిందూ దేవుళ్ల బొమ్మలు ముద్రించిన వెడ్డింగ్ కార్డ్ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో ఓ ముస్లిం యువకుడి పెళ్లి కార్డు విషయం స్థానికంగా సంచలంగా మారింది.దాంతో అక్కడి యువకులు ఆ పెళ్ళికార్డు యొక్క ఫొటోస్ ని సోషల్ మీడియాలో పెట్టగా వెలుగు చూసింది.

విదిషాలోని ఆనంద్‌పూర్‌లో నివాసముంటున్న దివంగత రుస్తమ్‌ఖాన్‌ కుమారులు ఇర్షాద్‌, అన్సార్‌ల వివాహం ఆదివారం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో పెళ్లి కార్డుల ద్వారా కుటుంబ సమేతంగా ఐక్యతా సందేశాన్ని అందించారు.

Telugu Ansar, Ganesharadha, Hindu, Irshad, Madhya Pradesh, Temple, Unity Diversi

అన్సార్, ఇర్షాద్‌లు వివాహ ఆహ్వానపత్రికపై హిందూ ఆరాధ్య దైవమైన గణేశుడి చిత్రాన్ని, అలాగే ఆహ్వానపత్రిక లోపల శ్రీకృష్ణుడు, రాధ కలిసివున్న చిత్రాన్ని ముద్రించారు.ముస్లిం యువకుడి పెళ్లిలో హిందూ దేవుళ్ల చిత్రాలను ముద్రించడంతో.ఈ పెళ్లి కార్డులు ఆ ప్రాంతమంతా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.22 మే 2022న జరగనున్న ఈ వివాహ కార్డులు హిందీ భాషలో ముద్రించబడ్డాయి.ఆహ్వాన పత్రికలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వంటి పదాలు కూడా వాడటం కొసమెరుపు.దాంతో సదరు పెళ్లి కార్డులను తిలకిస్తున్న నెటిజన్లు మతసామరస్యం అంటే ఇదే అంటూ కితాబిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube