ఆదర్శం : ఓటు వేసేందుకు బద్దకించే ప్రభుద్దులకు ఈయన ఆదర్శం, దుఃఖం దిగమింగి ఓటేసిన వ్యక్తి

ప్రతి పౌరుడికి ఓటు హక్కు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు.అయితే ఎంతో మంది తమ హక్కును వదులుకుంటున్నారు.

 Madhya Pradesh Man Votes After Performing Last Rites Of Father-TeluguStop.com

తమ హక్కును వదులుకున్న వారు అసలు ఈ దేశంలో ఉండటానికే అనర్హులు అంటున్నారు ప్రజాస్వామ్య వాదులు.ఓటు వేయనప్పుడు దేశంలో ఉండే హక్కు ఎలా ఉంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

దేశం గురించి బాధ్యత లేని నువ్వు, దేశం గురించి గంట కేటాయించి ఓటు వేయలేని నువ్వు ఈ దేశ పౌరుడిగా ఎలా చెప్పుకుంటున్నావు అంటూ ఓటు వేయని వారిపై సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.గ్రామాల్లో ఉండేటువంటి వారు ఓటు వేస్తుంటే పట్టణాల్లో ఉండే వారుమాత్రం ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదు అవుతుంది.ఓట్లు వేయకుండా టైం పాస్‌ చేసే వారికి మద్యప్రదేశ్‌కు చెందిన ఈ వ్యక్తి ఆదర్శంగా నిలుస్తున్నారు.

చిన్న చిన్న కారణాలు చూపుతూ ఓట్లకు దూరంగా ఉంటున్న వారు ఎంతో మంది ఉన్నారు.మొన్న ఒక వ్యక్తి ఓటు ఎందుకు వెయ్యలేదు అని ప్రశ్నిస్తే తలనొప్పి లేచి వెళ్లలేదు అంటూ సమాధానం ఇచ్చాడట.

అలాంటి వారికి గడ్డిపెట్టేలా మద్యప్రదేశ్‌కు చెందిన చత్తార్‌పూర్‌ నియోజకవర్గంకు చెందిన ఓటర్‌ వ్యవహరించారు.ఆయన తండ్రి మరణించడంతో అంత్యక్రియలు నిర్వహించారు.అంత్యక్రియలు పూర్తి అయిన వెంటనే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.కాని ఆయన మాత్రం పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటు వేసి ఇంటికి వెళ్లాడు.

ఆదర్శం : ఓటు వేసేందుకు బద్దకిం

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ వ్యహారం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.అతడి నిబద్దతకు అంతా కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.తండ్రి కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్నా కూడా ఓటు వేయాలనే సామాజిక బాధ్యతను మర్చిపోకుండా టవల్‌ కట్టుకుని, జట్టు గుండు చేయించుకున్నా కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా వెళ్లి ఓటు వేసి వచ్చాడు.అతడు చేసిన ఈ పని కనీసం పదిమందికి అయినా ఆదర్శం అవ్వాలని మనం కోరుకుంది.

ఇకపై అయినా మన దేశంలో ఎన్నికల శాతం పెరుగుతుందని ఆశిద్దాం.ఇప్పటికి కూడా ఓటు వేయకుండా ఉన్న వారు ఇకపై అయినా ఆలోచించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube