భార్యకు ప్రేమతో ఈ భర్త ఎలాంటి పని చేసాడంటే... ఏకంగా తాజ్ మహల్ నే..??

ప్రేమ, ప్యార్, ఇష్క్, లవ్ ఇలా ప్రేమకు ఎన్నో పేర్లు ఉన్నాయి.వినడానికి రెండు అక్షరాలే కదా అని అనుకుంటే పొరపాటు పడినట్లే.

 Madhya Pradesh Man Gave Taj Mahal Look A Like Home Gift To Wife Details,  Love,-TeluguStop.com

ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రేమను మించింది మరొకటి లేదు.ప్రేమ అనే రెండు అక్షరాలకు ప్రతి ఒక్కరూ బానిస అవ్వాలిసిందే.

ఎదుటివారి ప్రేమను దక్కించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తమ మనసులో ఉన్న ప్రేమను ఎక్సప్రెస్ చేసే క్రమంలో రకరకాల బహుమతులు ఇస్తూ ఉంటారు.

నిజానికి ప్రేమ అనేది ఇచ్చే బహుమతులలో ఉండదు.కానీ అది వారి వ్యక్తిగత విషయం.

ఈ క్రమంలోనే తన భార్య మీద ఎంత ప్రేమ ఉందో తెలపడానికి ఓ వ్యక్తి ఏకంగా తాజ్ మహల్ లాంటి ఓ అద్భుతమైన ఇంటిని నిర్మించి ఆమెకు బహుమతిగా ఇచ్చాడు.తాజ్ మహల్ అంటే ప్రేమకు చిహ్నంగా భావిస్తాము కదా.సరిగ్గా తాజ్ మహల్ లాగానే ఉండే ఒక భవంతిని నిర్మించాడు ఈ వ్యక్తి.మరి ఆ వ్యక్తి ఎవరు, ఆ భవనం ఎక్కడ నిర్మించారనే విషయాలు తెలుసుకుందామా.

అతని పేరు ఆనంద్ చౌక్సీ. ఆయనకు తన భార్య అంటే అమితమైన ప్రేమ.ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఆయన కొన్ని కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి మరి తన భార్యకు ప్రేమకు ప్రతిరూపంగా ఉండే ఒక అందమైన భవనం లాంటి తాజ్ మహాల్ ను బహుమతిగా ఇచ్చారు.ఈ భవనం ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లోని బుర్హాన్ పూర్ లో ఈ భవనాన్ని నిర్మించారు ఆనంద్.

అక్కడే భవనాన్ని నిర్మించడానికి ఒక కారణం కూడా ఉందంట.

Telugu Anand Choksi, Gave Taj Mahal, Gift, Latest, Love, Madhya Pradesh, Taj Mah

అదేంటంటే షాజహాన్ భార్య అయిన ముంతాజ్ ఈ ప్రాంతంలోనే చనిపోయారు కాబట్టి ఆనంద్ ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు.తన భార్య మీద ఉన్న ప్రేమను చీరలు, నగల రూపంలో చూపించడం తనకి ఇష్టం లేదని అందుకే తాజ్ మహల్ లాంటి ఇంటిని నిర్మించి ఇవ్వాలని అనుకున్నారట.ఈ భవన నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ ను సంబంధిత ఇంజనీర్ తో తయారు చేయించి, పనులు మొదలు పెట్టారు.

Telugu Anand Choksi, Gave Taj Mahal, Gift, Latest, Love, Madhya Pradesh, Taj Mah

ఈ భవన నిర్మాణం మొదలుపెట్టడానికి సుమారు మూడేళ్లకు పైగా సమయం పట్టిందని ఆనంద్ చెప్పారు.అలాగే ఇంటికి సంబంధించిన ప్రత్యేక డిజైన్ కోసం బెంగాల్, రాజస్థాన్ నుంచి ప్రత్యేక కళాకారులను రప్పించారట.ప్రస్తుతం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ ఇంట్లో పెద్ద హాలుతో పాటు, ఇంట్లో కింది భాగాన రెండు గదులు పైన మరో రెండు గదులు, తన భార్యకు ఇష్టం అయిన బుక్స్ ను పెట్టుకునేందుకు వీలుగా ఒక లైబ్రరీని కూడా ఇందులో ఏర్పాటు చేశారు.అలాగే ఒక ధ్యాన మందిరం కూడా ఇంట్లో ఉంటుంది.

అంతేకాకుండా రాత్రి సమయంలో తాజ్ మహల్ ఎలా అయితే మిరిమిట్లు గొలిపే లైట్స్ తో వెలిగిపోతుందో అచ్చం అలాగే కాంతులు విరాజిల్లేలా ఆ ఇంటికి ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేశారు ఆనంద్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube