18 నెలలకే సంక్షోభంలో పడ్డ మధ్యప్రదేశ్ ప్రభుత్వం

18 నెలల క్రితం మధ్యప్రదేశ్ లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సంక్షోభంలో పడింది.మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన ఈ రాష్ట్ర రాజకీయ సంచనాలు అర్ధరాత్రి,బుధవారం ఉదయం వరకు కొనసాగాయి.

 Madhya Pradesh Kamalnath Government In Crisis 18-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎనిమిదిమంది ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు గుర్ గావ్ లోని ఫైవ్ స్టార్ హోటల్ ‘మానే సార్’ కి బలవంతంగా తరలించి నిర్బంధించారని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ దిగ్విజయ్ సింగ్ ఆరోపిస్తున్నారు.అసలే అరకొర మెజారిటీతో కొనసాగుతున్న కమల్ నాథ్ ప్రభుత్వం బీజేపీ ఎత్తుగడలతో చిక్కుల్లో పడింది.

ఒక్కో ఎమ్మెల్యేకి 25 నుంచి 35 కోట్లు ఇఛ్చి తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు బేరసారాలాడుతున్నారని దిగ్విజయ్ సింగ్ అన్నారు.ఎనిమిది మంది శాసన సభ్యుల్లో నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు.

ఒకరు బీఎస్పీ నుంచి సస్పెండయిన రమాబాయి అనే ఎమ్మెల్యే కూడా ఉన్నారు.

Telugu Kamalnath, Madhya Pradesh, Madhyapradesh-Telugu Political News

అయితే రమాబాయిని, కాంగ్రెస్ కు చెందిన బిసాహులాల్ సింగ్ అనే ఎమ్మెల్యేని ఇద్దరు రాష్ట్ర మంత్రులు జైవర్ధన్ సింగ్, జీతూ పట్వారి ఈ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో హోటల్ నుంచి బయటికి తీసుకువఛ్చి రక్షించారు (దిగ్విజయ్ సింగ్ కుమారుడే జైవర్ధన్ సింగ్).ఈ దేశ రాజకీయాలను బీజేపీ భ్రష్టు పట్టిస్తోందని, డబ్బు, కండ బలంతో కమల్ నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు యత్నిస్తోందని జైవర్ధన్ సింగ్ ఆరోపించారు.ఐదేళ్లు కొనసాగాల్సిన ప్రభుత్వాన్ని బీజేపీ తన డబ్బు బలాన్ని ఉపయోగించి పడగొట్టాలని చూస్తుంది అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube