'మందు' ప్రాథమిక హక్కు

అయ్యా…! ఇది తాగుబోతు చెబుతున్న మాట కాదు.రౌడీయో, గూండానో చెబుతున్న కాదు.ఓ రాష్ర్ట హోం మంత్రి సెలవిచ్చారు.‘మందులు’ అంటే జబ్బు నయం చేసుకునే ఔషధాలు అని, ‘మందు’ అంటే ‘జబ్బు’ తెప్పించుకునేది అని తెలిసిన విషయమే.వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన బాబూలాల్‌ గౌర్‌ ‘తాగితే తప్పేముంది?’ అంటున్నారు.ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ హోం మంత్రిగా ఉన్న గౌర్‌ మందు గురించి హిత వాక్యాలు చెప్పారు.

 Alcohol Is A Status Symbol, Fundamental Right-TeluguStop.com

మందు తాగడం హాదాకు చిహ్నమని అన్నారు.అంటే స్టేటస్‌ సింబల్‌ అన్నమాట.

ఆయన ఇంతటితో ఆగలేదు.ఇది ‘ప్రాథమిక హక్కు’అని కూడా చెప్పకొచ్చారు.

మందు ఎక్కువ తాగితే నేరాల పెరుగుతాయనే వాదన ‘రబ్బిష్‌’ అని తీసిపారేశారు.ఆల్కాహాల్‌ వినియోగం వల్ల నేరాలు పెరగవని, తాగినోళ్లు కంట్రోల్‌ తప్పితే నేరాలు జరుగుతాయని అన్నారు.

మందు తాగే విధంగా తాగితే ఏం కాదని మందు బాబులకు ధైర్యం చెప్పారు.వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ప్రవృత్తిగా ఉన్న గౌర్‌ గతంలో ‘రేప్‌’ (మహిళలపై అత్యాచారం) ఒక్కోసారి కరెక్టు, ఒక్కోసారి రాంగ్‌ అని వ్యాఖ్యానించారు.

ఇది సామాజిక నేరం కావడమనేది స్ర్తీ, పురుషుల మీద ఆధారపడి ఉంటుందన్నారు.ఫిర్యాదు చేసినా ఏం జరగదన్నారు.

నేరాలు అదపు చేయాల్సిన, శాంతి భద్రతలు రక్షించాల్సిన హోం మంత్రే ఇలా మాట్లాడితే రౌడీలకు, గూండాలకు అడ్డు ఉంటుందా? ఇలాంటివాడు హోం మంత్రిగా ఉండటం మన ఖర్మ…!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube