ప్రభుత్వాధికారులు జీన్స్, టీ షర్ట్ వేసుకోరాదు : మధ్యప్రదేశ్  

government officials should not wear jeans and t shirts madhya pradesh, Madhya Pradesh, governament, jeans and t-shirts, - Telugu Governament, Jeans And T-shirts, Madhya Pradesh

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వస్త్రదారణపై ఆంక్షలు విధించింది.ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు టీ షర్ట్, జీన్స్ వేసుకుని కార్యాలయాలకు రావొద్దని ఉత్తర్వులు జారీ చేసింది.

 Madhya Pradesh Governament Jeans And T Shirts

గౌరవ ప్రదమైన దుస్తులు ధరిస్తేనే ఉద్యోగులకు సమాజంలో అధికారిగా గుర్తింపు, హుందాతనం కనబడుతాయని వెల్లడించింది.ప్రభుత్వ కార్యాలయాల్లో జీన్స్, టీషర్ట్ వేసుకుని రావొద్దని, వస్తే ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.

ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ కారణం ఉంది.ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన గత నెల జూలై 20న ఓ సమావేశ కార్యక్రమం జరిగింది.

ప్రభుత్వాధికారులు జీన్స్, టీ షర్ట్ వేసుకోరాదు : మధ్యప్రదేశ్-Telugu Political News-Telugu Tollywood Photo Image

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వాధికారులు హాజరయ్యారు.మాండ్ సౌర్ జిల్లాకు చెందిని ఓ అధికారి టీ షర్టు ధరించి కార్యక్రమానికి హాజరయ్యాడు.

అది చూసిన సీఎం ఆ అధికారిపై ఆగ్రహించాడు.బాధ్యత గల పదవిలో ఉంటూ సమావేశానికి టీ షర్ట్ వేసుకుని రావడం ఏంటని ప్రశ్నించాడు.

దీంతో గ్వాలియర్ డివిజన్ లోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కార్యాలయాలకు జీన్స్, టీ షర్టులు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.ప్రభుత్వ ఉద్యోగులందరూ సాంప్రదాయ దుస్తువులు ధరించి కార్యాలయాలకు హాజరు కావాలని ఆదేశించారు.

ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

#Governament #Madhya Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Madhya Pradesh Governament Jeans And T Shirts Related Telugu News,Photos/Pics,Images..