రూ.200లతో లక్షాధికారి అయిన రైతు.. ఎలాగంటే?

ఎవరి జీవితంలోనైనా అదృష్టమనేది ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది.కానీ దరిద్రము తలుపు తెరిచే వరకు తడుతూనే ఉంటుంది.

 Mp Farmer Finds Diamond Worth 60 Lakh In Land, Madhya Pradesh,farmer,diamond,lea-TeluguStop.com

మన జీవితంలోకి అదృష్టం కన్నా దరిద్రం ఎక్కువసార్లు వస్తుంటుంది ఇలాంటి నేపథ్యంలోనే ఓ రైతుకు అదృష్టం తలుపు తట్టడంతో రాత్రికి రాత్రే ఆ రైతును లక్షాధికారి చేసింది.కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఆ రైతును లక్షాధికారి చేసింది.

అది ఎలాగంటే…

మధ్యప్రదేశ్ లోని పన్నాకు చెందిన 45 ఏళ్ల రైతు లఖన్ యాదవ్‌ పన్నా ప్రాంతంలో నేషనల్ పార్క్ ఏర్పాటు చేయడంతో అక్కడి నివసించే ప్రజలను పలు ప్రాంతాలకు తరలించారు.ఈ నేపథ్యంలోనే ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న లఖన్ యాదవ్ కేవలం రెండు వందల రూపాయలను చెల్లించి కొంత భూమిని లీజుకు తీసుకున్నాడు.

పొలాన్ని లీజుకు తీసుకోవడంతో ఆ పొలంలో పనులు ప్రారంభించి, భూమిని తవ్వుతుండగా అతనికి ఒక రాయి దొరికింది.

Telugu Diamond, Madhya Pradesh, Mpfinds-Latest News - Telugu

చూడటానికి కొంతమేర భిన్నంగా ఉన్న రాయిని తీసుకెళ్లి సమీపంలో ఒక వజ్రాల వ్యాపారికి చూపించాడు.అయితే అది రాయి కాదని, వజ్రమని చెప్పడంతో లఖన్ యాదవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.అతనికి దొరికిన వజ్రం 14.98 క్యారెట్ల వజ్రం అని వ్యాపారి తెలిపారు.ఈ వజ్రం విలువ దాదాపు 60 లక్షల రూపాయలు ఉంటుందని తెలియడంతో లఖన్ యాదవ్ ఎంతో సంబరపడిపోయారు.

ఆ వజ్రాన్ని అమ్మి ఆ రైతు రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయాడు.తను పెద్దగా చదువుకోకపోవడంతో తన నలుగురి పిల్లలను మంచి చదువులు చదివించడానికి ఆ డబ్బును ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

ఆ డబ్బులు కొంత మొత్తం తన పిల్లల పేర్లతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు యాదవ్ తెలిపారు.అంతే కాకుండా తన పొలంలో మరికొన్ని వజ్రాలు దొరుకుతాయేమో అన్న అనుమానంతో ఆ పొలంలోనే పనులు కొనసాగిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆ రైతు తెలిపారు.

ఏదిఏమైనా కేవలం రెండు వందల రూపాయలతో ఆ రైతు లక్షాధికారిగా మారిపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube