పెళ్లి ఆపడానికి వెళ్లిన అధికారులు.. ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రస్తుతం దేశం లో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అందరికీ తెలిసిందే.ఇక ప్రస్తుతం అన్ని పనులు వాయిదా పడుతున్న సమయంలో.

 Madhya Pradesh Couple Marriage In Ppe Kits Viral, Madhya Pradesh, Navin Garg, Ra-TeluguStop.com

గత కొన్ని నెలల నుండి శుభకార్యాలకు ముహూర్తాలు లేక ఇప్పుడు పెళ్లిళ్ల ముహూర్తాలు వచ్చేప్పటికి మళ్లీ ఈ వైరస్ వెంటాడుతుంది.గతేడాది కూడా ఇదే సమయం పెళ్లిళ్లు అతి తక్కువ సమక్షంలో జరగగా.

మళ్లీ ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదురవుతుంది.ఇదిలా ఉంటే తాజాగా వైరస్ నేపథ్యంలో పెళ్లి ఆపడానికి వెళ్లిన అధికారులే పెళ్లి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.


మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లంలో లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓ పెళ్లి వేడుక జరిగింది.అసలు కారణం ఏంటంటే వరుడికి ఏప్రిల్ 19 న కరోనా పాజిటివ్ రావడంతో తహసీల్దార్ నవీన్ గార్గ్, అధికారులు ఈ పెళ్లిని ఆపడానికి వచ్చారు.

కానీ సీనియర్ అధికారి సూచన మేరకు పీపీఈ కిట్లు ధరించి వివాహం జరిపించాలని అనుమతి ఇచ్చాడు.ఇక వరుడి తరఫున నలుగురు, వధువు తరఫున నలుగురు హాజరయ్యి వీళ్లంతా కూడా వధూవరులతో పాటు పీపీఈ ఇట్లు ధరించారు.


ఇక వధూవరులు పీపీఈ కిట్లు ధరించి తమ ఆచారం ప్రకారం హోమం గుండం చుట్టూ వేద మంత్రాలతో తిరిగారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.

ఈ వీడియోను ట్విట్టర్ ద్వారా ఏఎన్ఐ పంచుకుంది.ఇక రోజు రోజుకు వైరస్ కేసులు సంఖ్యలో పెరుగుతున్న క్రమంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిషేధాలు విధించారు.

అంతేకాకుండా ప్రస్తుతం పెళ్లిళ్లు ముహూర్తాలు దగ్గర పడుతున్న సమయంలో వధూవరుల తల్లిదండ్రులకు మళ్లీ ఈ వైరస్ విజృంభన ఎదురవక తప్పట్లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube